ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పటికే విభిన్నమైన చిత్రాలు, పవర్ ఫుల్ నటనతో తిరుగులేని నటిగా బాలీవుడ్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. కంగనా రనౌత్ సోలో హీరోయిన్ గా నటించే చిత్రాలు బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా రాణిస్తున్నాయి. చివరగా కంగనా రనౌత్ జడ్జిమెంటల్ హై క్యా, మణికర్ణిక లాంటి చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం మరో అద్భుత చిత్రానికి సిద్ధం అవుతోంది. కంగనా రనౌత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'తలైవి'. తమిళుల అభిమాన నాయకురాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆల్రెడీ ప్రారంభమైంది. 

కుర్ర హీరోతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. నిజమేనా?

జయలలితగా కంగనా రనౌత్ వివిధ గెటప్పులలో ఈ చిత్రంలో కనిపించనుంది. జయలలిత జీవితంలో ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారు. వారిలో స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్, జయలలిత కలసి పలు చిత్రాల్లో నటించారు. సినీ రంగంలో రాణించిన ఈ ఇద్దరూ రాజకీయాల్లో కూడా జయకేతనం ఎగురవేశారు. 

దీనితో దర్శకుడు ఏఎల్ విజయ్ ఎన్టీఆర్ పాత్రని ఆయన కుటుంబ సభ్యులే పోషించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం విజయ్ జూనియర్ ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. కానీ తాతగారి పాత్రలో నటించే విషయంలో జూ. ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని ఆల్రెడీ చెప్పేశాడు. 

కీర్తి సురేష్ నటించిన మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కోసం మొదట మొదట జూ. ఎన్టీఆర్ ని సంప్రదించారు. కానీ జూ. ఎన్టీఆర్ ఒప్పులేదు. ఇదే విషయాన్ని మహానటి ప్రీరిలీజ్ వేడుకలో కూడా జూ. ఎన్టీఆర్ తెలిపాడు. తనని తాతగారి పాత్ర కోసం అడిగిన మాట వాస్తవం అని.. కానీ ఆ మహానుభావుడి పాత్రలో తాను నటించడం జరగదని జూ. ఎన్టీఆర్ తేల్చేశాడు. 

నేనెప్పుడూ హాట్ గానే ఉంటా : ఈషా రెబ్బ

ఆ సమయంలోనే జూ. ఎన్టీఆర్ నిర్ణయం ఏంటో తెలిసిపోయింది. అయినా కూడా తలైవి చిత్ర యూనిట్ జూ. ఎన్టీఆర్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తోందట. అదే సమయంలో బాలకృష్ణని కూడా రిక్వస్ట్ చేస్తున్నట్లు టాక్. తలైవి చిత్రానికి నిర్మాత విష్ణు ఇందూరి. ఎన్టీఆర్ బయోపిక్ మూవీని నిర్మించింది కూడా ఆయనే. 

జూ. ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరిలో ఎన్టీఆర్ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. వీరిద్దరిలో ఎవరు అంగీకారం తెలిపినా తలైవి చిత్రానికి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.  జూ. ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ అంగీకరించకపోతే ఎన్టీఆర్ పాత్రని ఎవరు పోషిస్తారో వేచి చూడాలి.