అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ అగ్రహీరోలందరి సరసన నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కాజల్ అగర్వాల్ ఖాతాలో ఉన్నాయి.  దాదాపు దశాబ్దానికి పైగా కాజల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇన్నేళ్ల కెరీర్ లో కాజల్ అగర్వాల్ ఎప్పుడూ గ్లామర్ విషయంలో హద్దులు దాటలేదు. 

అవసరమైన మేరకు అందంగా కనిపిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ కు ఇటీవల సరైన సక్సెస్ లేదు. కాజల్ ఈ ఏడాది నటించిన సీత, రణరంగం చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో కాస్త కాజల్ అగర్వాల్ జోరు తగ్గింది. 

చిరు 152.. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్ కు కలవరం తప్పదు!

కమల్ హాసన్ సరసన నటిస్తున్న ఇండియన్ 2 తప్ప కాజల్ చేతిలో పెద్ద చిత్రాలేవీ లేవు. దీనితో కాజల్ మీడియం రేంజ్ హీరోల సరసన నటించేందుకు కూడా అంగీకారం చెబుతున్నట్లు తెలుస్తోంది. విజయాలు లేకవడంతో కాజల్ ఓ మెట్టు దిగివచ్చిందట. యువ హీరో శ్రీవిష్ణు తదుపరి డెబ్యూ దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శత్వంలో నటించబోతున్నాడు. 

లక్ష్య ప్రొడక్షన్ సంస్థ నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నటించేందుకు చిత్ర యూనిట్ కాజల్ అగర్వాల్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కనుక కాజల్ నటిస్తే మంచి బజ్ ఏర్పడడం ఖాయం. 

ఎన్టీఆర్ తో ఇష్టంలేకుండా సినిమా చేశా.. డైరెక్టర్ హాట్ కామెంట్స్!

ఇదిలా ఉండగా ఈ చిత్రం పోలీస్ డ్రామాగా తెరకెక్కనుంది. శ్రీవిష్ణు ఈ ఏడాది బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం లాంటి చిత్రాల్లో నటించారు. శ్రీవిష్ణు నటనలో పరిపక్వత ప్రదర్శిస్తూ క్రమంగా తన మార్కెట్ పెంచుకుంటున్నాడు.