ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించడానికే ఇష్టపడుతుంటారు. హాట్ గా కనిపిస్తేనే అవకాశాలు కూడా వస్తాయని.. తమ అందాలు ఒలకబోస్తుంటారు. కానీ కొందరు మాత్రం హోమ్లీగా కనిపించాలని అనుకుంటారు. కానీ తెలుగమ్మాయి ఈషా రెబ్బ పరిస్థితి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది.

ఈ బ్యూటీకి తెరపై హాట్ గా కనిపించడమంటే  ఇష్టం. కానీ దర్శకనిర్మాతలు మాత్రం తనకు హోమ్లీగా ఉండే పాత్రలకే పరిమితం చేస్తున్నారని చెబుతోంది ఈషారెబ్బ. అయితే 'రాగల 24 గంటల్లో' అనే సినిమాలో ఈషా అందంగా కనిపిస్తూనే.. హాట్ గా కూడా అనిపించింది. 

విజయ్ దేవరకొండ మూవీ.. పూరి ఆ హీరోయిన్ ని వదిలేలా లేడుగా!

ఈ సినిమాలో ఆమెపై కొన్ని ఘాటైన బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలను చిత్రీకరించారు. వాటిని ట్రైలర్ లో మచ్చుకు కొన్ని చూపించారు. ఈ సినిమాలో తను హాట్ గా కనిపించానని.. తనలో కూడా హాట్ నెస్ ఉందనే విషయాన్ని గుర్తించినందుకు థాంక్స్ అని చెబుతోంది ఈషా. తానెప్పుడూ హాట్ గానే ఉంటానని.. కానీ తెలుగమ్మాయి అనేసరికి సినిమాల్లో స్టీరియోటైపులో చూపిస్తున్నారని చెప్పింది.

తనలో హాట్ నెస్ ని మేకర్స్ చూపించలేదని.. విలేజ్ బ్యాక్ డ్రాప్, ట్రెడిషనల్ రోల్స్ కి పరిమితం చేస్తున్నారని.. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతున్నానని.. ఇప్పటికైనా గుర్తించినందుకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది.  తెలుగమ్మాయి అనే ట్యాగ్ లైన్ వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నానని చెబుతోంది ఈషా.

ఆఫర్లు తగ్గిపోతుంటాయని, స్టీరియోటైపు పాత్రలకే ఫిక్స్ చేస్తారని అంటోంది. తనకు ఛాన్స్ ఇస్తే హాట్ గా కనిపించడానికి, గ్లామర్ ఒలకబోయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదని చెబుతోంది.