తన సినీ ప్రస్థానంలో వేలాది పాటు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం. సినిమా పాటలతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు కూడా పాడారు. రాజకీయ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.

Also Read:బాలు మరణంతో రజనీ, కమల్‌ కన్నీటి పర్యంతం

తన గాత్రంతో పలు  పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు బాలు. తెలుగుదేశం పార్టీ కోసం పాడిన ఓ పాట ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లలో ఉరకలెత్తిస్తుందనే చెప్పాలి. టీడీపీ కోసం పాడిన ‘‘ కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా’’ అంటూ సాగే ఆ పాట ఇప్పటికీ చాలా ఫేమస్.

పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. బాలసుబ్రమణ్యం మరణం తర్వాత ఈ పాట విన్న టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయను గుర్తుచేసుకుంటున్నారు.

Also Read:బాలును బలితీసుకుంది ఆ రియాలిటీ షోనేనా?

స్వయంగా తెలుగుదేశం చీఫ్, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సైతం కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసిందని ట్వీట్ చేశారు.