Asianet News TeluguAsianet News Telugu

హృదయం బరువెక్కింది, రాత్రంతా నిద్రపట్టలేదు... సూర్య జై భీమ్ పై సీఎం స్టాలిన్ రివ్యూ

jai bhim ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ సినిమా గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా స్పందించారు.

tamilanadu cm mk stalin review on suriya jai bhim
Author
Hyderabad, First Published Nov 2, 2021, 3:09 PM IST

స్టార్ హీరో సూర్య చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం జై భీమ్. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించారు. సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద మనుషులు చేస్తున్న దాడి, అనే సామాజిక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అన్యాయంగా ఓ కేసులో చిక్కుకున్న పేద కుటుంబం తరపున పోరాడే లాయర్ గా Suriya నటించారు. ఈ సినిమాను సూర్య, జ్యోతిక తమ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించారు. 


jai bhim ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ సినిమా గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా స్పందించారు. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జై భీమ్ మూవీ చూశాక నోట మాట రాలేదు.  నా హృదయం బరువెక్కిపోయింది, రాత్రంతా నిద్రపట్టలేదు. ఆ సినిమానే మదిలో మెదిలింది... అంటూ తెలియజేశారు. ఓ సుదీర్ఘమైన లేఖలో సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. అలాగే జై భీమ్ హీరో సూర్యను ప్రత్యేకంగా పొగిడారు. అలాగే చిత్ర యూనిట్ కి cm stalin బెస్ట్ విషెష్ తెలియజేశారు. 


ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జై భీమ్ చిత్రం గురించి మాట్లాడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సోషల్ మీడియాలో జై భీమ్ మూవీ గురించి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనసుకు హత్తుకునే ఎమోషన్స్, డైలాగ్స్ తో కూడిన ఆలోచింపచేసే కోర్ట్ రూమ్ డ్రామా అన్న మాట వినిపిస్తోంది. సురారై పోట్రు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య, జై భీమ్ తో మరోమారు మెరిశారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

Also read సూర్య 'జై భీమ్' రివ్యూ
మరోవైపు వరుసగా తన చిత్రాలు ఓటిటిలో విడుదల చేస్తున్న సూర్యపై థియేటర్స్ యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. సూర్య సినిమాలను బ్యాన్ చేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవేమి పట్టించుకోకుండా, సూర్య తన పని తాను చేసుకుపోతున్నాడు. మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న రాకెటరీ మూవీలో సూర్య గెస్ట్ రోల్ చేస్తున్నారు. పాండిరాజ్, వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారు. 

Also read Puneeth rajkumar : జిమ్ చేయడం వలన కాదు, పునీత్ మరణానికి అసలు కారణం అదే

Follow Us:
Download App:
  • android
  • ios