Asianet News TeluguAsianet News Telugu

సూర్య 'జై భీమ్' రివ్యూ

 1995లో మారు మూల అడవుల్లో ఉండే అణిగారిన వర్గాలకి చెందిన కొందరిని పోలీసులు అన్యాయంగా ఓ కేసులో ఇరికించారు.  ఆ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాగా తెరకెక్కేటప్పుడు ఈ సంఘటనలలో ఏ మార్పులు జరిగాయి. సినిమా అందరికీ నచ్చుతుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Suriya Jai Bhim Telugu Movie Review
Author
Hyderabad, First Published Nov 2, 2021, 2:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాస్తవికంగా జరిగిన కొన్ని సంఘటనలు నిజాయితీగా తెరపై ఉన్నదున్నట్లు  చెప్పటం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ అడ్డం వచ్చేస్తూంటాయి. కానీ ఓటీటి వచ్చాక సినిమాని చూసే తీరు మారింది. బ్రిలియెంట్ రైటింగ్ తో మామూలు కథలు కూడా కమర్షియల్ స్దాయిలో చెప్తున్నారు. అలా ధైర్యం చేస్తున్న హీరోలలో సూర్య ఒకరు. మాస్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆయన తాజాగా ఓ కోర్ట్ రూమ్ డ్రామాతో మన ముందుకు వచ్చారు. 1995లో మారు మూల అడవుల్లో ఉండే అణిగారిన వర్గాలకి చెందిన కొందరిని పోలీసులు అన్యాయంగా ఓ కేసులో ఇరికించారు.  ఆ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాగా తెరకెక్కేటప్పుడు ఈ సంఘటనలలో ఏ మార్పులు జరిగాయి. సినిమా అందరికీ నచ్చుతుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ
పాములు పట్టి జీవితం పోషించుకునే రాజన్న(మణికందన్‌) తన కష్టంతో నిజాయితీగా బ్రతుకుతూంటాడు. ఆ క్రమంలో ఓ లోకల్ పొలిటీషన్ ఇంట్లోకి పాము రావడంతో ఇతన్ని పిలుస్తే వెళ్తాడు. ఆ తర్వాత అదే ఇంట్లో దొంగతనం జరుగుతుంది. దీంతో ఆ దొంగతనం చేసింది రాజన్నే అని అనుమానంతో పోలీస్ కంప్లైంట్ చేస్తారు. అక్కడనుంచి  పోలీస్ లు  ఆ దొంగతనం  ఒప్పుకోమని రాజన్నని తీవ్రంగా చిత్రహింసలు పెడతారు. అంతేకాకుండా నువ్వు దోచేసిన సొమ్ము ఎక్కడ పెట్టారంటే అతని ఫ్యామిలీని సైతం విచారణ చేస్తారు...వేధిస్తారు. ఈలోగా రాజన్నతోపాటు మరో ఇద్దరు లాకప్‌ నుంచి తప్పించుకొన్నారని అతడి భార్య చిన్నతల్లి(లిజో మోల్‌ జోసే)కు చెబుతారు. దాంతో ఆమెకు ఏం చేయాలో తోచదు. అప్పుడు ఈ విషయమై కోర్టులో కేసు వేస్తే పోలీసులే అతడిని వెతికి తీసుకొచ్చి ఇస్తారని, అందుకు లాయర్ చంద్రు(సూర్య) సాయం చేస్తాడని తెలుస్తుంది. దీంతో చిన్నతల్లి లాయర్‌ చంద్రును దగ్గరకు వెళ్లటం జరుగుతుంది. చలించిపోయిన చంద్రు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేసు వాదించటానికి ముందుకు వస్తాడు. అక్కడనుంచి చంద్రుకు, పోలీస్ లకు మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ చంద్రు ప్రయత్నంతో రాజన్న విషయం తేలిందా..  చంద్రును గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ (రావు రమేష్) ఎలా అడ్డుకొనే ప్రయత్నం చేసారు. ఈ కథలో ఐజీ పెరుమాళ్లు స్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏమిటి?   చివరకు చంద్రు సక్సెస్  సాధించాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎనాలసిస్ ..
To Kill a Mockingbird
ఈ సినిమా థ్రిల్లర్ గా సాగే  కోర్టు రూమ్‌ డ్రామా. దాదాపు ఇలాంటి కథనమే మనకు  ‘నాంది’, ‘వకీల్‌సాబ్‌’ లలో కనిపిస్తుంది.  న్యాయానికి, చట్టానికి మధ్య జరిగే వాద,ప్రతివాదాలు సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తాయి. కథ మెల్లిగా మొదలై సూర్య పాత్ర వచ్చాక స్పీడందుకుంటుంది. సూర్య కేసుని డీల్ చేయటం మొదలెట్టాక వచ్చే అడ్డంకులతో స్క్రీన్ ప్లే పరుగులె పెడుతుంది. సూర్య చేసే పనికి మనకు జై కొట్టాలనిపిస్తుంది. అ స్దాయిలో అవతలి రాజన్న పాత్రను డిజైన్ చేసారు. అమాయకులైన గిరిజనలుపై కేసులు బనాయించటం మనం పేపర్లో చదువుతూనే ఉంటాం. అది మన కళ్ల ఎదురుగా ఆవిష్కారం అవుతుంది. అలాగే పోలీస్ లు గురించి మనం వింటూనే ఉంటాం. వాళ్ళు నేరం ఒప్పించేందుకు ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది కూడా ఇక్కడ చూస్తాం.  ఇలా రెండు వైపులా స్ట్రాంగ్ గా మోటివేషన్ ఉండటంతో కథలో కాంప్లిక్ట్స్ నిలబడి ఆసక్తి కలిగిస్తుంది. అయితే సినిమాని స్లో గా నడపాలనే నియమం పెట్టుకోవటం వల్ల అక్కడక్కడా మనకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే లాకెప్ లో జరిగే సీన్స్, పోలీస్ సీన్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. మనకు గతంలో వచ్చిన విచారణ సినిమా గుర్తుకు వస్తుంది. క్లైమాక్స్ లో రాజన్న ఏమయ్యాడు అనే  అసలు విషయం బయిటపడం అప్పటిదాకా చూసిన సినిమా ఒకెత్తు..ఆ విషయం ఒకెత్తు అన్న ఫీల్ కలిగిస్తుంది. అలా స్క్రిప్టుని బాగా లాక్ చేయటమే ఈ సినిమాకి కలిసొస్తుంది. 

Also read Samantha: సమంతను లైన్ లో పెడుతున్న తాప్సీ.. ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

టెక్నికల్ గా..

నటీనటుల్లో సూర్య లాయర్‌గా జీవించారనే చెప్పాలి.   ముఖ్యంగా కోర్టు సీన్స్ లో  ఆయన పలికిన ఎక్సెప్రెషన్స్ నెక్ట్ లెవిల్. అలాగే  గిరిజన దంపతులుగా నటించిన మణికందన్‌, లిజో మోల్‌ జోసేలు ఈ కథని నిలబెట్టేసారు. లిజో ను చూస్తూంటే మనకు ఎలాగైనా ఆమెకు న్యాయం జరగితే బాగుండును అనిపిస్తుంది. డీజీపీ గా ప్రకాశ్‌రాజ్‌, రాజిషా విజయన్‌, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. 

Also read ఆర్ ఆర్ ఆర్ కి దారిచ్చిన పవన్, మహేష్... ప్రభాస్ మాత్రం ఢీ!

టెక్నికల్ గా సూర్య రెగ్యులర్ సినిమాల స్దాయిలో ఉంది. ఓటీటి సినిమాకు తగ్గట్లుగా బడ్జెట్ కంట్రోలు కనపడుతుంది. ఇక కథ జరిగిన  నాటి వాతావరణం క్రియేట్ చేయటానికి ఆర్ట్ డిపార్టమెంట్ బాగా కష్టపడింది.  ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటింగ్‌ బాగున్నాయి.  షాన్‌ రొనాల్డ్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. డైలాగులు కూడా సినిమాకి ఎక్కడా డబ్బింగ్ ఫీల్ తేలేదు.  

ప్లస్ లు 
ఎంచుకున్న కథ
సూర్య
టెక్నికల్ బ్రిలియెన్స్

మైనస్ లు
స్లోగా నడవటం

ఫైనల్ ధాట్

 నిజాయితీగా చేసే ప్రతీ ప్రయత్నం ఖచ్చితంగా  'జై' కొట్టించుకుంటుంది.

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3

తెర వెనక..ముందు

నటీనటులు: సూర్య, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజిష విజయన్‌, లిజోమోల్‌ జోసీ, మణికంఠన్‌ తదితరులు; 
సంగీతం: షాన్‌ రొనాల్డ్‌; 
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌; 
సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.కాదిర్‌; 
నిర్మాత: సూర్య, జ్యోతిక; 
రచన, దర్శకత్వం: త.శె.జ్ఞానవేల్‌; 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Follow Us:
Download App:
  • android
  • ios