జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగులో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో అంజలికి లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆ మూవీ సక్సెస్ ని అంజలి కొనసాగించలేకపోయింది. 

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

అంజలి కొంత కాలం పాటు జర్నీ ఫేమ్ హీరో జైతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. 2017లో అంజలి, జై కలసి బెలూన్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం తనకు తీవ్రమైన నష్టాలని మిగిల్చిందని నిర్మాత నందకుమార్ వాపోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందకుమార్ జై, అంజలి రిలేషన్ షిప్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

హీరో జై వల్లే తనకు నష్టాలు ఎదురయ్యాయని ఆరోపించాడు. అంజలి చాలా మంచి అమ్మాయి. వృతి పరంగా, వ్యక్తిగతంగా పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆమె జీవితంలోకి జై వచ్చాడో అప్పుడే చెడిపోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జైతో ప్రేమలో పడక ముందు వరకు అంజలి షూటింగ్స్ కి సమయానికి చేరుకునేది. 

మహేష్, బన్నీ సంక్రాంతి ఫైట్ : భయపడ్డారా..? రాజీ పడ్డారా..?

బెలూన్ చిత్రానికి నష్టాలు రావడానికి కారణం జై. సెట్స్ లో తాను అంజలిని పేరు పెట్టి పిలిచేవాడిని. కానీ జై మాత్రం చాలా అతి చేసేవాడు. అంజలి ఏంటి.. మేడం అని పిలవండి.. లేకుంటే షూటింగ్ ఆపేస్తా.. అని నానా హంగామా చేసేవాడు. కానీ అంజలి మాత్రం తనని పేరు పెట్టి పిలిచినందుకు ఫీల్ అయ్యేది కాదు. 

కొడైకెనాల్ లో షూటింగ్ కు వెళ్ళినప్పుడు అంజలి, జైకి వేరు వేరు గదులు బుక్ చేశాం. కానీ వారిద్దరూ ఒకే గదిలో గడిపేవారు. రెండో రూమ్ వృధా అని క్యాన్సిల్ చేయబోతే జై చిరుబుర్రులాడాడు. రెండో గది కూడా ఉండాల్సిందే అని పట్టుబట్టాడు. ఆ గదికి ఒక రోజులు అద్దె 12 వేలు అని చెప్పినా వినిపించుకోలేదు. 

ఇలియానా ఆత్మహత్యకు ప్రయత్నించిందా?.. షాకిస్తున్న కారణం!

మరో సందర్భంలో జై, అంజలి షూటింగ్ కు రాలేదు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంజలి స్పందించలేదు. చివరికి అంజలి ఫోన్ చేసి తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పింది. దీనితో మేం వెంటనే ఆమె గది వద్దకు కారు పంపాం. కానీ అంజలికి నిజంగా కడుపు నొప్పి లేదు. జై, అంజలి ఇద్దరూ కలసి నాటకాలు ఆడారు. అదే కారులో ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. దీనితో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. తమకు చాలా నష్టం వచ్చిందని నిర్మాత నందకుమార్ తెలిపారు.