- Home
- Entertainment
- Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
Bigg Boss 9 Remuneration : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుని.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్.. తన రెమ్యునరేషన్ ను పేదలకు పంచి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? ఆమె చేసిన పనికి నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఫైనల్ స్టేజ్ కు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇంకా రెండు వారాలకు ఈ రియాల్టీ షోకు ఎండ్ కార్డు పడబోతోంది. ప్రతీ రోజు చాలా ఉత్కంఠతో కొనసాగుతోంది బిగ్ బాస్ తెలుగు. ఈ సీజన్ విన్నర్ ఎవరు అన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి ఎనాలసిస్ వారు చెపుతున్నారు. అయితే ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు ఉన్నట్టు సమాచారం. పవన్ తరువాత స్థానంలో ఇమ్మాన్యుయోల్, తనూజ ఉన్నారు. ఈ ముగ్గురిలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది తేలబోతున్నట్టు సమాచారం. ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కు సబంధించిన కొన్నివార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్
బిగ్ బాస్ 9 హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండకపోయినా, ఆడియన్స్ పై గట్టి ప్రభావం చూపిన కంటెస్టెంట్స్‌లో దివ్వెల మాధురి ఒకరు. రాజకీయంగా మంచి పరిచయం, పలుకుబడి ఉన్న సెలబ్రిటీ కంటెస్టెంట్ .. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆమె బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ఆమె హౌస్ లో అడుగు పెడితే చెడుగుడు స్టార్ట్ అవుతుందని రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే అనుకున్నట్టుగానే బిగ్ బాస్ లోకి వచ్చిన రోజునుంచే తన నోటికి పనిచెప్పి.. ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో నెగెటీవ్ ఇహేజ్ ను ఆమె మూటకట్టుకున్నారు. హౌస్‌లోకి వచ్చిన ఫస్ట్ వీక్ లోనే మాధురి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆతరువాత ఆడియన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల కాస్త తగ్గి రెండో వారం నుండి ఆమె అజాగ్రత్తగా గేమ్ ఆడింది. కానీ మాధురిపై వచ్చిన నెగెటివిటీ మాత్రం పెరుగుతూ వచ్చింది. అయితే ఆమెలో వచ్చిన కాస్తో కూస్తో మార్పుని ఆడియన్స్ మాత్రం గమణించారు. సేవ్ అయ్యే అవకాశం ఉన్నా కానీ.. దాన్ని ఉపయోగించుకోకుండా.. ఎలిమినేషన్‌ను స్వీకరించి.. అందరిలో పాజిటీవ్ అభిప్రాయాన్ని తీసుకొచ్చింది మాధురి.
పేదలకు రెమ్యునరేషన్ పంచిన మాధురి
బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఉన్న సమయంలో, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ ఒక ప్రకటన చేశారు. మాధురి బిగ్ బాస్ ద్వారా సంపాదించే డబ్బును పేదలకు విరాళంగా ఇవ్వబోతున్నామన్నారు. ఈ ప్రకటనను చాలామంది కేవలం మాట వరుసకే అనుకున్నారు. అయితే, హౌస్ నుంచి మాధురి బయటకు వచ్చిన వెంటనే ఈ దంపతులు మాట నిలబెట్టుకున్నారు.ఇటీవల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ తమకి అత్యంత సన్నిహిత అనుచరుడైన లక్ష్మీ నారాయణను హాస్పిటల్‌లో పరామర్శించారు. చాలా కాలంగా బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంలో దువ్వాడ దంపతులు మొత్తం 80,000 రూపాయిల ఆర్థిక సహాయం అందించారు. అందులో 30,000 రూపాయిలు వైద్య చికిత్స కోసం, మరో 50,000 రూపాయిలు కుటుంబ పోషణ కోసం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.
మాధురి రెమ్యునరేషన్ అంత తక్కువా..?
ఇక ఈ వివరాలను దువ్వాడ శ్రీనివాస్ ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. అయితే మాధురి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కేవలం 80,000 రూపాయిలేనా అన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియలో వ్యక్తం అవుతున్నాయి. సెలబ్రిల కేటగిరీలో హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమెకు కనీసం వారానికి ఒక లక్ష రూపాయిల చొప్పున రెమ్యూనరేషన్ వచ్చి ఉంటుందేమో అని అంటున్నారు. మూడు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మాధురికి..కనీసం మూడు లక్షలు అయినా రాకుండా ఉన్నాయా అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ రెమ్యునరేషన్ తనకు పెద్దలెక్కలోనిది కాదని.. బిగ్ బాస్ లోకి వెళ్లి తనను తాను తెలుసుకోవాలనే ఆలోచనతో వచ్చినట్టు మాధురి ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే, మాధురి, శ్రీనివాస్ దంపతులు పేదలకు దానం చేయడం విషయంలో సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.
