నడుము సుందరి ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవదాసు చిత్రం ముందువరకు ఇలియానా మోడలింగ్ లో బిజీగా గడిపింది. దేవదాసు చిత్రంతో వైవిఎస్ చౌదరి ఇలియానాని టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఆ చిత్రంలో ఇలియానా గ్లామర్ మెరుపులు ఆకట్టుకున్నాయి. తన సెకండ్ మూవీతోనే సూపర్ స్టార్ మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇలియానా, మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో ఇలియానా గ్లామర్ కు తెలుగు యువత అంతా ఫిదా అయ్యారు. పోకిరి తర్వాత ఇలియానా డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఇలియానా కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. 

ఇలియానాకు ఇప్పుడు తెలిసొచ్చిందా.. టాలీవుడ్ టాప్ దర్శకులతో..

ఈ నిర్ణయమే ఇలియానా కెరీర్ ని బాగా డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం ఇలియానాకు సరైన అవకాశాలు దక్కడం లేదు. గత ఏడాది ఇలియానా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో నటించింది. ఆ చిత్రంలో ఇలియానా బాగా లావుగా కనిపించింది. కొంతకాలం పాటు ఇలియానా తన ఫిజిక్ పై దృష్టిపెట్టలేదట. ఆమె డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. 

నాకింకా చాలా డబ్బు కావాలి.. ఇలియానా కామెంట్స్!

డిప్రెషన్ కారణంగా తరచుగా నిద్రమాత్రలు తీసుకునేది, దీనితో శరీరంపై నియంత్రణ కోల్పోయి లావైపోయిందని అంటున్నారు. ఆ సమయంలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. కెరీర్ లో ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకుని తిరిగి ఫిజిక్ పై ఫోకస్ పెట్టింది. ఫలితంగా ఇలియానా మునుపటిలా నాజూగ్గా మారింది. 

ఇలియానా నటించిన లేటెస్ట్ మూవీ పాగల్ పంతి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విజయం సాధిస్తే బాలీవుడ్ లో ఈ నడుము సుందరికి అవకాశాలు మెరుగవుతాయి.