భారత దేశీయ మూలాలున్న యుఎస్ పోర్న్స్టార్ సన్నీలియోనీ భారత దేశంలో అడుగుపెట్టి ఏండ్లు గడుస్తున్నాయి. ఇక్కడే సెటిలైపోవాలని డిసైడైందట సన్నీ. నేను ఇక్కడికి వచ్చిన అతిథిని. ఇక్కడే వుండాలనుకుంటున్నా అంటూ ఓ ఛానెల్ నిర్వహించిన సన్నీ కా హంగామా అనే కార్యక్రమంలో చెప్పిన సన్నీ పలు అంశాలపై తన మనోగతాన్ని వెల్లడించింది.

 

సెక్స్‌ ఎడ్యుకేషన్‌ విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత. అంతేకానీ టీచర్లు చెప్పే పాఠ్యాంశాల నుంచి రాదు.ఈ విషయంలో ఇద్దరు మహిళలు నాకు వ్యతిరేకంగా డిబేట్‌లో పాల్గొన్న వీడియోను చూశాను. ఇలాంటి సందర్భాల్లో గట్టిగా జవాబు చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందోనన్న భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే అరిచి చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.