గత ఏడాది అమెరికాలోని కొలంబస్ నగరంలో డేనియల్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డేనియల్స్ ని అరెస్ట్ కూడా చేశారు. దీనిపై డేనియల్స్ కోర్టులో న్యాయపోరాటం చేసింది. అనవసరంగా ఈ కేసులో ఇరికించారని పోలీసులపై పరువునష్టం దావా వేసింది. 

కొలంబస్ నగరంలో ఓ నైట్ క్లబ్ లో డేనియల్స్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిందని ఆమెపై అభియోగం నమోదైంది. క్లబ్ లోని ఓ అధికారితో డేనియల్స్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. డోనాల్డ్ ట్రంప్ తో తనకున్న సంబంధాన్ని బహిరంగం చేయడం వల్లే అధికారులు కక్ష్య సాధింపుకు పాల్పడుతున్నారని.. తనపై నమోదైన కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని డేనియల్స్ ఆరోపించింది. 

తాజాగా ఈ కేసులో డేనియల్స్ విజయం సాధించింది. వాస్తవానికి ఈ కేసులో డేనియల్స్ 2 మిలియన్ డాలర్ల(దాదాపుగా రూ.14 కోట్లు) పరువునష్టం దావా వేసింది. కానీ కొలంబస్ అధికారులు 4.5 లక్షల డాలర్లకు(దాదాపుగా 3 కోట్లు) ఇష్యూని సెటిల్ చేశారు. 

మొత్తంగా డేనియల్స్ అమెరికన్ అధికారుల నుంచి రూ 3 కోట్లు పిండుకుంది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాకముందు తనతో సన్నిహితంగా మెలిగేవాడని, మా ఇద్దరిమధ్య ఎఫైర్ సాగిందని డేనియల్స్ చేసిన వ్యాఖ్యలు ఆమెకు విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి.