టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు బెదిరింపు కాల్స్ వచ్చాయా..? ఆమెను చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారా..? ఇంతకీ ఆ ఫోన్ చేసింది. ఎవరు..? ఈ విషయంలో పూజా హెగ్డే టీమ్ ఏమని స్పందించారు..? 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతోంది. టాలీవుడ్ లో స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా ఆమె సినిమాలు వరుసగా బోల్తా కొటడంతో.. పూజా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందులోనూ ఆమె చేసిన పాన్ ఇండియా సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో పూజా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. 

ఇక ప్లాప్ లు పెరగడంతో.. అవకాశాలుతగ్గుతూ వస్తున్నాయి. ఐరన్ లెక్ అన్న పేరు పడటంతో.. పూజాహెగ్డే సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తోంది. ఈక్రమంలో మహేష్ బాబుతో చేయబోయిన గుంటూరు కారం మూవీ నుంచి వెనక్క రావల్సి వచ్చింది. లైగర్ ఫెయిల్యూర్ తో.. విజయ్ దేవరకొండతో చేయాల్సి జనగనమణ సినిమా ఆగిపోయింది. ఆ రకంగా కూడా కలిసిరాలేదుపూజాకు. 

Sowmya Rao: జబర్థస్త్ నుంచి అందుకే బయటకు వచ్చా.. యాంకర్ సౌమ్యరావు సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది.. బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె చెతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. బాలీవుడ్ లో మాత్రం ఒకటి రెండుసినిమాలు ఉన్నాయంతే. ఒక రకంగా ఆమెకు 2020 నుంచి హిట్లు లేవు. అలవైకుంఠపురములో తరువాత పూజా హెగ్డే హిట్టు చూసింది లేదు. ఇక తాజాగా పూజా హెగ్డేకు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చి హల్ చల్ చేస్తుంది. 

 పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వ‌చ్చాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమెకు బెదిరింపు రావడం ఏంటీ అటూ.. వార్తలు వైరల్ అయ్యాయి. పూజా రీసెంట్‌గా దూబాయ్ వెళ్ల‌గా.. ఆక్కడ ఒక ఈవెంట్​లో ఆమె గొడవ పడిందని.. ఈ కారణంగా పూజా​కు హత్యా బెదిరిపులు వచ్చాయని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. 

Ram Gopal Varma: పంతం నెగ్గించుకున్న ఆర్జీవీ, వ్యూహం సినిమాకు సెన్సార్ క్లియరెన్స్.. రిలీజ్ డేట్..?

దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇక పూజ హెగ్డే ఫ్యాన్స్ కు ఇవన్నీ తెలిసి భయం స్థార్ట్ అయ్యింది. తమ అభిమాన హీరోయిన్ గురించి ఆందోళన చెందుతున్నారు అభిమానులు . అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై పూజా టీమ్ స్పందించింది.

పూజా హెగ్డేని చంపేస్తామని వ‌చ్చిన బెదిరింపులు అబ‌ద్ద‌మ‌ని పూజా టీమ్ తెలిపింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. అదంతా పూర్తిగా అవాస్తవం అని పూజా టీమ్ చెప్పుకోచ్చింది.

ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కోయి షక్‌ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా వ‌స్తున్న ఈ సినిమాను మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీతో అయినా హిట్ కొట్టి.. తనుకు ఉన్న చెడ్డ పేరును తీసేసుకోవాలి అని చూస్తోంది బ్యూటీ.