అనుకున్నది సాధించాడు  రామ్ గోపాల్ వర్మ. ఎట్టకేలకు వ్యూహం సినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. సెన్సార్ క్లయరెన్స్ కూడా రావడంతో..వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు ఆర్జీవి.

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తాను ఎంతో ఇష్టపడి, పట్టదలతో తెరకెక్కించిన సినిమా వ్యూహం. దీని తరువాత శబథం కూడా నెక్ట్స్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈరెండు సినిమాలను రామ్ గోపాల్ వర్మ.. ఏపీ పాలిటిక్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లైఫ్ లోని కొన్ని సంఘటనలు ఆధారంగా తీసుకుని.. గతంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను కథగా రాసుకుని ఆర్జీవీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ జగన్ ను సపోర్ట్ గా ప్రతి పక్షాలను..మరీముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై దుమ్మెత్తిపోసే విధంగా ఉంటుంది అని అందరి అభిప్రాయం. 

ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకు పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈసినిమా కోసం ఎంతగానో ఎదరు చూస్తున్నారు. అసలు వర్మ ఏం చూపించబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఎప్పుడెప్పుడా అని ఈమూవీస్ గురించి ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అదేటైమ్ లో టీజర్లు, ట్రైలర్లు అంటూ వర్మ చేసిన హడావిడి ఇంకాస్త క్యూరియాసిటీని పెంచాయి. అయితేఈ ఆత్రానికి సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసింది. హ్యూహం సెన్సార్ దగ్గరే ఆగిపోయింది. 

నవంబర్ 10న రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయిన వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు.. ఆర్జీవీకి సెన్సార్ బోర్డు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఈమూవీలోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులను పోలి ఉన్నాయని, వారిని డైరెక్ట్ గా విమర్షించడంతో పాటు.. వారిని విలన్లుగా చూపించారంటూ .. సెన్సార్ అభ్యంతరం చెప్పింది. అంతే కాదు రివైజ్ కమిటీకి వెళ్ళాలని సూచించింది. దాంతో వర్మ రిలీజ్ డేట్ మార్చుకోవల్సి వచ్చింది. అంతే కాదు సెన్సార్ దగ్గర సినిమా ఆగిపోడానికి కారణం కూడా తెలుగుదేశం వాళ్లే అంటూ..అక్కసు కూడా వెల్లడించారు వర్మ. 

Sowmya Rao: జబర్థస్త్ నుంచి అందుకే బయటకు వచ్చా.. యాంకర్ సౌమ్యరావు సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేరు. సెన్సార్ బోర్డు రివైజ్ కమిటీకి ఎందుకు వెళ్ళమని చెప్పారో నాకు తెలియదు. దీని మీద టిడిపి వాళ్ళు ఏమన్నా పిర్యాదు చేసారా అనేది కూడా తెలియాల్సి ఉంది... అని విమర్షలు చేశారు. ఇక ఎట్టకేళకు వర్మ అనుకున్నది సాధించారు. వ్యూహం సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. నవంబర్ 10 రిలీజ్ అవ్వాల్సిన సినిమాకు కొత్త డేట్ కూడా అనౌన్స చేశాడు ఆర్జీవి.

Scroll to load tweet…

సెన్సార్ క్లియరెన్స్ రావడంతో వర్మ సంతోషంగా ప్రకటించాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. డిసెంబర్ 29న ఈమూవీ రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించాడు. అంతే కాదు సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇక వ్యూహం సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జగన్ ఎదుర్కొన్న సందర్భాలు, సమస్యలు చూపిస్తూ సీఎం ఎలా అయ్యారు అనేది చూపించబోతున్నారు. అంతే కాదు ఈసినిమా తరువాత తాను ఇక పొలిటికల్ సినిమాలు చేయడం మానేస్తానని కూడా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.