Sowmya Rao: జబర్థస్త్ నుంచి అందుకే బయటకు వచ్చా.. యాంకర్ సౌమ్యరావు సంచలన వ్యాఖ్యలు
సడెన్ గా జబర్థస్త్ నుంచి మానేసింది యాంకర్ సౌమ్య రావు. కామెడీ షోకు అద్భుతంగా యాంకరింగ్ చేస్తుంది అనుకుంటే.. సడెన్ గా మాయం అయ్యింది. ఇక దానికి కారణం ఏంటో చెపుతోంది బ్యూటీ.

Hyper Aadi-Sowmya Rao
జబర్థస్త్ నుంచి యాంకర్ సౌమ్య రావు ఎందుకు సడెన్ గా మాయం అయ్యింది...? తను వెల్లిపోయిందా..? లేక తీసేశారా..? తాజాగా సౌమ్యరావు ఈ విషయంలో చెప్పినసమాధానం ఏంటీ..? ఆమె ఘాటుగా ఎందుకు స్పందించింది...?
Hyper Aadi-Sowmya Rao
జబర్థస్త్ ఖతర్నాక్ కామెడీ షో.. దాదాపు గత పద్నాలుగేళ్ళుగా.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. నవ్విస్తూ సాగిపోతోంది.అంతే కాదు ఎక్కడో మారుమూలన ఉన్న కామెడీ స్టార్స్ ను బయటకు తీసి.. సామాన్యులను సెలబ్రిటీలను చేసింది జబర్థస్త్ షో... కడుపుబ్బా నవ్వించే జబర్థస్త్ కొన్నేల్ళ పాటు బాగానే సాగింది. ఈ నాలుగేదైళ్ళుగా ఈ ప్రోగ్రామ్ లో కుదుపులు స్టార్ట్ అయ్యాయి.
జడ్జ్ లు మారడం, యాంకర్లు మారడం, కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లు సినిమా అవకాశాలు రాగానే జబర్థస్త్ ను వీడటం.. ఇలా నానీ చికాకుల మధ్య యాంకర్ గా రెండో సారి కూడా హ్యాండ్ ఇచ్చింది అనసూయ. సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇక రష్మి, రాఘవ లాంటివారు మాత్రమే మొదటి నుంచి కొనసాగుతన్నారు. ఈక్రమంలో కొన్నాళ్ళ కిందట.. అనసూయ వెళ్ళిపోయిన తరువాత యాంకర్ గా అడుగు పెట్టింది సౌమ్య రావు.
కన్నడనాట బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ.. వచ్చీ రాని తెలుగులో జబర్థస్త్ ను అద్భుతంగా నడిపించింది. కంటెస్టెంట్స్ నుంచి వచ్చే పంచ్ లను ఆస్వాదిస్తూ.. కలిసిపోయింది. ఎమోషనల్ గా కూడా అందరితో బాండింగ్ ఏర్పరుచుకుంది. కాని ఎందుకో సడెన్ గా జబర్థస్త్ నుంచి సైలెంట్ గా తప్పుకుంది సౌమ్య రావు.
అయితే ఆమె తప్పుకుందా..? లేుక తప్పించారా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఏదో జరిగింది అన్నది మాత్రం వాస్తవం. సౌమ్య ప్లేస్లో ప్రస్తుతం జబర్థస్త్ ను బిగ్ బాస్ బ్యూటీ సిరీ హనుమంత్ యాంకరింగ్ చస్తోంది. ఈక్రమంతో తాను ఎందుకు జబర్థస్త్ ను వీడాను అనేదానిపై క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.
జబర్థస్త్ సన్నిహితులు సమాచారం ప్రకారం సౌమ్యను యాంకర్‌గా తీసేశారంటున్నారు. కాని సౌమ్యనే వెళ్లిపోయిందో, తీసేశారో.. తెలియదు. ఆమె స్థానంలోకి బిగ్ బాస్ బ్యూటీ సిరిని తీసుకొచ్చి పెట్టారు. ఈ మార్పు వెనుక ఎవరున్నారు? మల్లెమాల టీం ఈ నిర్ణయం తీసుకుందా? జబర్దస్త్ డైరెక్షన్ టీం తీసుకుందా? లోలోపల ఏమైనా గూడుపుఠాణి జరిగిందా? సౌమ్య దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు.
తాజాగా ఇలా ఓ నెటిజన్ మాత్రం ఆమెను అడిగేశారు. మీరు ఎందుకు జబర్దస్త్ షోను వదిలి వెళ్లారు? అని నెటిజన్ అడిగితే.. దానికి సౌమ్య ఇచ్చిన రిప్లై ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. టైం వస్తుంది.. అప్పుడు అన్నీ చెప్తా.. థాంక్యూ సో మచ్ అని ముగించేసింది. అంటే జబర్దస్త్ షోకు సౌమ్య దూరం అవ్వడం వెనక పెద్ద తతంగమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి సౌమ్య ఎప్పుడు నోరు విప్పుతుందో.. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.