శ్రీరెడ్డి: లారెన్స్ కేవలం మీకోసం అంటూ వల్గర్ వీడియో పోస్ట్ చేసింది!

Sri Reddy Deletes Vulgar Video about Lawrence
Highlights

రాఘవ మాస్టర్ గారు.. ఇదిగో ఈ వీడియో నా టాలెంట్ కు శాంపిల్ మాత్రమే.. చూడు కేవలం నీకోసమే చేశా అంటూ ఆ వీడియోలో అతడిపై బూతుల వర్షం కురిపిస్తూనే అతడి భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చింది.

డైరెక్టర్ కమ్ యాక్టర్ రాఘవ లారెన్స్ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకున్నారంటూ నటి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన లారెన్స్.. శ్రీరెడ్డికి ఓ ఛాలెంజ్ విసిరాడు. నీకు టాలెంట్ ఉంటే ప్రెస్ వాళ్ల ముందు నటించి చూపించమని అన్నారు. లారెన్స్ ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రీరెడ్డి అతడిని ఉద్దేశిస్తూ ఓ వల్గర్ వీడియో పోస్ట్ చేసింది.

'రాఘవ మాస్టర్ గారు.. ఇదిగో ఈ వీడియో నా టాలెంట్ కు శాంపిల్ మాత్రమే.. చూడు కేవలం నీకోసమే చేశా' అంటూ ఆ వీడియోలో అతడిపై బూతుల వర్షం కురిపిస్తూనే అతడి భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. లారెన్స్ ను విమర్శించడానికి తనకు మాత్రమే వచ్చే బూతులను వాడిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. కానీ ఏం అనుకుందో ఏమో వెంటనే ఆ వీడియోను తొలగించింది. ఆ తరువాత వెంటవెంటనే తన పెర్ఫార్మన్స్ వీడియోలు పోస్ట్ చేసింది.

అయితే అందులో పెర్ఫార్మన్స్ మాత్రం లేదు. డాన్స్ వీడియో అంటూ మరొకటి పోస్ట్ చేసి ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. వీటికంటే దబ్ స్మాష్ వీడియోలు మేలంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. లారెన్స్ యాక్టింగ్ స్కిల్స్ చూపించమంటే నువ్వు ఎక్స్ పోజ్ చేస్తున్నావేంటి అంటూ మరికొందరు ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

శ్రీరెడ్డికి లారెన్స్ పంచ్.. 

తెగేవరకు లాగకు.. లారెన్స్ కు శ్రీరెడ్డి వార్నింగ్!

loader