తెగేవరకు లాగకు.. లారెన్స్ కు శ్రీరెడ్డి వార్నింగ్!

sri reddy warning to lawrence
Highlights

నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ తనకు అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా వాడుకున్నట్లు నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ తనకు అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా వాడుకున్నట్లు నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. హోటల్ రూమ్ కు తీసుకెళ్లి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అతడిపై చేసిన ఆరోపణలు అందరికీ షాక్ ఇచ్చాయి. కోలీవుడ్ కు వెళ్లి అక్కడ మీడియాతో కూడా ఇదే విషయంపై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

దీంతో లారెన్స్ ఈ విషయంపై స్పందిస్తూ ఆమెకొక ఛాలెంజ్ విసిరాడు. టాలెంట్ ఉంటే మీడియా అందరి ముందు నటించమని, నిజంగానే టాలెంట్ ఉందని అనిపిస్తే తనకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని అన్నాడు లారెన్స్. శ్రీరెడ్డి తనపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అయితే ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ లారెన్స్ కు వార్నింగ్ ఇచ్చింది.

'తెగేవరకు లాగడం నీకు మంచిది కాదు. నేను విచారణకు కూర్చుంటే గనుక నువ్వు నెగ్గలేవు. మనం కచ్చితంగా కలిసి పని చేద్దాం.. నీకు నచ్చితే గనుక. నా టాలెంట్ నాకు ఉంది. నీ టాలెంట్ ఏంటో కూడా నేను చూశాను. మన కాంబినేషన్ అదుర్స్' అంటూ పోస్ట్ పెట్టింది. 

 

ఇది కూడా చదవండి

శ్రీరెడ్డికి లారెన్స్ పంచ్..

loader