శ్రీరెడ్డికి లారెన్స్ పంచ్..

Raghava Lawrence replies to Sri Reddy's allegations
Highlights

శ్రీరెడ్డి 'రెబెల్' సినిమా సమయంలో నన్ను కలిసినట్లు చెప్పారు. నేను ఆ సినిమా చేసి ఏడేళ్లు అయింది. ఆమె అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు. సరే ఆ విషయాన్ని వదిలేద్దాం.. ఆమె నా హోటల్ రూమ్ కి వచ్చినప్పుడు నేను ఆమెను వాడుకున్నానని చెప్పారు. 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాలు పేరిట మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని కొందరు సినీప్రముఖులు అవకాశాల ఆశ చూపి తనను శారీరకంగా వాడుకున్నారని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కోలీవుడ్ కు చెందిన కొందరు తారలు సైతం తనను మోసం చేశారని రాఘవ లారెన్స్, సుందర్ సి, మురుగదాస్ వంటి వారిపై ఆరోపణలు చేసింది. సుందర్ సి తనపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఇక తాజాగా లారెన్స్ కూడా ఈ విషయంపై స్పందించారు. కొందరు అనాధ పిల్లలను తన ట్రస్ట్ ద్వారా పోషిస్తోన్న లారెన్స్ ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి సరిగ్గా 13 ఏళ్లు అయిందట. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ శ్రీరెడ్డి విషయంపై క్లారిటీ ఇచ్చారు. ''శ్రీరెడ్డి విషయంపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. అది నాకు పెద్ద విషయం కూడా కాదు. కానీ చాలా మంది మీడియా సభ్యులు నాకు ఫోన్లు చేసి ఇదే వవిషయంపై ప్రశ్నిస్తున్నారు. సో.. అందరికీ ఈరోజు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. శ్రీరెడ్డి 'రెబెల్' సినిమా సమయంలో నన్ను కలిసినట్లు చెప్పారు. నేను ఆ సినిమా చేసి ఏడేళ్లు అయింది. ఆమె అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు. సరే ఆ విషయాన్ని వదిలేద్దాం.. ఆమె నా హోటల్ రూమ్ కి వచ్చినప్పుడు నేను ఆమెను వాడుకున్నానని చెప్పారు. అలానే నా రూమ్ లో రుద్రాక్ష మాల, దేవుడి ఫోటోలు చూశానన్నారు. హోటల్ రూమ్ లో రుద్రాక్షలు, దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజ చేయడానికి నేనేమైనా మూర్ఖుడినా..?. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. నేనేంటో నాకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు.

అసలు నీ సమస్య ఏంటి శ్రీరెడ్డి..? ఇండస్ట్రీలో అందరూ నిన్ను వాడుకొని అవకాశాలు ఇవ్వలేదు అదేనా..? ఒకపని చేద్దాం.. నేను ప్రెస్ మీట్ పెడతాను.. నువ్వు కూడా ఆ ప్రెస్ మీట్ లో పాల్గొను.. మీడియా అందరి ముందు నేనొక సీన్, కొన్ని డాన్స్ మూమెంట్స్ చేయమని చెప్తాను.. సింపుల్ డాన్స్ మూమెంట్సే ఇస్తాను. నువ్వు పెర్ఫెక్ట్ గా చేస్తే నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను. నీకు మీడియా వారి ముందు నటించడానికి ఇబ్బందిగా ఉంటే.. నా మ్యానేజర్ కు ఫోన్ చేసి నీ సన్నిహితులు, లాయర్ తో వచ్చి నా ముందు నటించి చూపించు. నీకు నిజంగానే టాలెంట్ ఉందనిపిస్తే కచ్చితంగా అవకాశం ఇస్తాను. ఇది నీకు భయపడి నేను రిప్లై చేయడం లేదు.. నిజానికి నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది. నేను మహిళలను ఎంతగానో గౌరవిస్తాను. అందుకే మా అమ్మకు గుడి కట్టి అది అందరి ఆడవాళ్లకు అంకితమిచ్చాను. మంచి పనులు చేస్తూ మంచి మాటలు మాట్లాడదాం.. నీ జీవితం బాగుండాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను' అని తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చారు.

loader