బాలీవుడ్ లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల రిలేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ కారణంగానే మలైకా తన భర్తకి విడాకులు ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విడాకులు తీసుకున్న తరువాత మలైకా, అర్జున్ లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

పలు ఈవెంట్లకు ఇద్దరూ కలిసి హాజరవ్వడం, ఫారెన్ టూర్లకి వెళ్లడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా వార్తలను ప్రచురిస్తోంది. ఇటీవల కరణ్ జోహార్ కూడా ఓ ఈవెంట్ లో వీరిద్దరి పెళ్లిపై పరోక్షంగా కామెంట్ చేశారు. కొందరు ఈ జంటకి మద్దతుగా నిలుస్తుంటే ఎక్కువ మంది మాత్రం వీరిని విమర్శిస్తున్నారు.

తాజాగా నటి శ్రీరెడ్డి వీరి బంధంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ''మలైకా, అర్జున్ కపూర్ ల జంట ఎంతో క్యూట్ గా ఉంది. మీకు నచ్చినట్లు జీవించడంలో తప్పు లేదు. ఈ సమాజం కోసం మీరు బాధ పడకండి. మనం ఎలా ఉన్నా ఈ సమాజం మనల్ని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది.

విడాకులు తీసుకోవడం తప్పు కాదు.. వయసులో చిన్నవాడితో రిలేషన్ పెట్టుకోవడం నేరం కాదు. మీ ఇద్దరికీ నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

నేనున్నా కదా.. సీనియర్ నటికి కుర్ర హీరో భరోసా!

ఏ భర్త ఇలా చేసి ఉండడు.. విడాకులపై అర్భాజ్ ఖాన్ కామెంట్స్!

నువ్వు కుర్రాడితో తిరిగితే..నేను కుర్రపిల్లను లైన్లో పెట్టా

విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

విడాకుల హీరోయిన్ ప్రేమలో యంగ్ హీరో..?