కరోనా దెబ్బకు జన జీవినం అస్తవ్యస్తంగా మారింది. లక్షలాది కుటుంబాలు ఉపాది కోల్పోయి రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. ఉన్న చోట ఉద్యోగాలు లేక, సొంత ఊరికి వెళ్లే దారి లేక చాలా మంది అనే ఇబ్బందులు పడ్డారు. అయితే అలాంటి వారిని ఆదుకుునేందుకు సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించారు. అందరికంటే ఎక్కువగా సోనూ సూద్‌ వేలది మంది వలస కూలిలకు సాయం అందించాడు.

వందలాది బస్సుల్లో వాళ్లను సొంత గ్రామాలకు చేరవేశాడు. అలా వెల్లే వారికి భోజనాలు ఏర్పాటు చేయటంతో పాటు అన్ని రకాలుగా సాయం చేశాడు. దీంతో ఒక్కసారిగా దేశమంతా సోనూ సూద్ పేరు మారుమోగిపోయింది. ఏదో డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవటం కాకుండా తానే దగ్గరుండి సాయం చేయటంతో అన్ని ఏర్పాట్లు చూసుకోవటంతో సోనూను ఆకశానికి ఎత్తేశారు నెటిజెన్లు.

అయితే తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. వలస కార్మికులకు భారీ సాయం అధించిన సోనూ, తాజా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నంలో మరణించిన వలస కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. మార్గ మధ్యంలో మరణించిన దాదాపు 400 మంది వలస కార్మికుల కుటుంబాలకు సాయం  చేసేందుకు రెడీ అవుతున్నాడు సోనూ.

ఇప్పటికే బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇలా మార్గ మధ్యంలో మరణించిన వారి వివరాలను, బ్యాంక్‌ డిటైల్స్‌ను సేకరించిన సోనూ సూద్‌, దాదాపు 400 కుటుంబాలకు నేరుగా బ్యాంక్ అకౌంట్ల లోకి డబ్బు వేసే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంతో మరోసారి సోనూ సూద్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది.