ఆచితూచి మాట్లాడకపోతే జనం ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియా జనాలకు ఎప్పటికప్పుడు ఓ కొత్త విషయం కావాలి.  ఎవరు ఎప్పుడు దొరుకుతారా ట్రోల్ చేద్దామని చాలా మంది చూస్తూంటారు. తాజాగా చిరంజీవి ..భారతరత్న డిమాండ్ తెరపైకి వచ్చి కామెడీగా మారిపోయింది. చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడిగా రవనం స్వామినాయుడు  చేసిన ఓ డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సైరా సినిమా చుసిన ఆయన భావోద్విగ్నతకు లోనయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ… చిరంజీవి పెర్ఫార్మన్స్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఓ మాట అన్నారు.  ఇంతగొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చిన చిరంజీవికి భారత ప్రభుత్వం చిరంజీవికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. సినిమా పెర్ఫార్మన్స్ కు భారతరత్న ఏంటి అని ఆ మీడియా వాళ్ళు  మొదట ఆశ్చర్యపోయినా మనకెందుకులే అని మిన్నకుండిపోయారు.

సినిమాలకు భారతరత్న ఇవ్వరని  ఆయన తెలయదని ఊరుకున్నారు. అయితే స్వామినాయుడు ఊరుకోలేదు.  ఆ తరువాత కూడా అదే డిమాండ్ తో ట్వీట్ చేసారు. దాంతో  ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేరే స్టార్ హీరోల ఫ్యాన్స్ ఈ ట్వీట్  పట్టుకుని మెగా ఫ్యాన్స్ ను ట్రోల్ చేయటం మొదలెట్టారు. దాంతో మెగా ఫ్యాన్స్ చాలా మంది ...ఇలా ఇరికించేసేడేంటి అని అనుకుంటున్నారు.

కలెక్షన్స్ విషయానికి వస్తే.. సైరా మొదటి రోజు బాక్స్ ఆఫీసు వద్ద ఇరగదీసింది. చాలా చోట్ల బాహుబలి 2 తరువాతి స్థానంలో ఉంది. సినిమా టాక్ బావుండడంతో దసరా సెలవులు పూర్తి అయ్యే వరకూ సినిమా దూకుడు తగ్గదంటున్నారు.