ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చెప్పిన వ్యాఖ్యలు తెలుగు మీడియా వక్రీకరించినట్లు శృతి హాసన్ సోషల్ మీడియా వేదిక తెలియజేశారు. వార్తలలో వస్తున్నట్లుగా తాను అలాంటి ఆరోపణలు చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. రేసు గుఱ్ఱం, గబ్బర్ సింగ్ చిత్రాలు తన కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయని, ఆ చిత్రాలలో నటించడం గురించి తాను అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే శృతి హాసన్ కి అందరూ మద్దతుగా నిలవడం విశేషం. ముఖ్యంగా పవన్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఈ పోస్ట్ కి రియాక్ట్ అవుతున్నారు. పవన్ సరసన మరోమారు శృతి హాసన్ ని చూడాలని కోరుకుంటున్నారు. శృతి గబ్బర్ సింగ్ తో పాటు కాటమరాయుడు మూవీలో పవన్ ఇక జంటగా నటించింది. 

గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా, కాటమరాయుడు మిశ్రమ ఫలితం అందుకుంది. ముచ్చటగా మూడోసారి శృతి హాసన్, పవన్ వకీల్ సాబ్ మూవీలో జతకట్టనున్నారు. ఈ మూవీలో శ్రుతిది కేవలం క్యామియో రోల్ మాత్రమే. పవన్ తో ఆమెకు ఒకటి రెండు సన్నివేశాలతో పాటు ఒక పాట ఉంటుంది. కనిపించేది కొంతసేపే అయినా పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ కాంబినేషన్ పై మంచి ఆసక్తి నెలకొనివుంది.