Asianet News TeluguAsianet News Telugu

హాలీవుడ్ హీరోల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న ప్రభాస్... స్పిరిట్ కోసం అన్ని కోట్లా!

కొద్దిరోజుల క్రితం ప్రభాస్ తన 25వ చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ప్రకటించారు. స్పిరిట్ అనే పవర్ ఫుల్ టైటిల్ నిర్ణయించగా.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.

shocking remuneration charging prabhas for spirit movie
Author
Hyderabad, First Published Oct 17, 2021, 11:36 AM IST

దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి చిత్రంతో ఇండియా సినిమా బాక్సాఫీస్ బౌండరీలు మార్చేసిన ప్రభాస్... వేల కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అయితే సాహో నెగిటివ్ రివ్యూలు అందుకుంది. అయినప్పటికీ హిందీలో ఈ చిత్రం హిట్ గా నిలిచింది. బాలీవుడ్ ప్రేక్షకులు Sahoo చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 


నెగిటివ్ టాక్ లో కూడా సాహో వందల కోట్ల వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. దానితో Prabhas మార్కెట్ రేంజ్ ఏమిటో దర్శక నిర్మాతలకు ఓ క్లారిటీ వచ్చింది. ప్రభాస్ తో చిత్రం అంటే కనీసం రూ. 400 కోట్ల బడ్జెట్ ఉండాలి అన్న తీరుగా పరిస్థితి మారింది. ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల బడ్జెట్ కలిపితే రూ. వెయ్యికోట్ల పైమాటే. దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన ప్రాజెక్ట్ కె బడ్జెట్ రూ. 500 కోట్లు. 

Also read ‘అన్‌స్టాపబుల్ ’ : అక్కడ ప్రభాస్ ..ఇక్కడ బాలయ్య
కాగా కొద్దిరోజుల క్రితం ప్రభాస్ తన 25వ చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ప్రకటించారు. స్పిరిట్ అనే పవర్ ఫుల్ టైటిల్ నిర్ణయించగా.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ తన కెరీర్ లో పోలీస్ రోల్ చేయలేదు. అయితే Spirit సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ. 150కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఇండియాలో మరే ఇతర హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం లేదు. అంటే ప్రభాస్ రెమ్యూనరేషన్ రేంజ్ హాలీవుడ్ స్థాయి హీరోలను చేరుకుంది. 

Also read ‘అఖండ’ రిలీజ్ కు మళ్లీ ట్విస్టా,ఇలా చేసారేంటి?బాలయ్య
ఇండియాతో పాటు జపాన్, చైనా, కొరియా వంటి దేశాల్లో కూడా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు మార్కెట్ ఉంది. అందుకే ప్రభాస్ ఆ స్థాయిలో సినిమాకు చార్జ్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ మొత్తం ఐదు ఇండియన్ బాషలతో పాటు, మూడు విదేశీ బాషలలో విడుదల కానుంది. టి సిరీస్ తో పాటు సందీప్ వంగా సొంత బ్యానర్ లో స్పిరిట్ తెరకెక్కునుంది. ఇక స్పిరిట్ 2022 చివర్లో లేదా 2023 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, Salaar చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సందీప్ రెడ్డి వంగ రన్బీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios