Asianet News TeluguAsianet News Telugu

‘అన్‌స్టాపబుల్ ’ : అక్కడ ప్రభాస్ ..ఇక్కడ బాలయ్య

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈ ‘స్పిరిట్‌’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్‌ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం.
 

Balakrishna and Prabhas remunerations are the hot topic
Author
Hyderabad, First Published Oct 17, 2021, 8:34 AM IST

ప్రభాస్ ప్రాజెక్టుల గురించి చెప్పేదేముంది. వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రకటిస్తున్న సినిమాలు చూసి అన్‌స్టాపబుల్  అనిపిలుచుకుంటున్నారు సోషల్ మీడియా జనం. అలాగే రెమ్యునేషన్ విషయంలోనూ ప్రభాస్ ని కొట్టేవారు కనపడటం లేదు. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈ ‘స్పిరిట్‌’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్‌ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం.

రీసెంట్ గా వంగా సందీప్‌ రెడ్డి డైరెక్షన్‌లోనే ప్రభాస్‌ నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీ సిరీస్‌, సందీప్‌ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్‌ పాన్‌ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్‌ పొందుతున్నాడని బీ టౌన్‌ టాక్‌. ‘స్పిరిట్‌’ సినిమాకు ప్రభాస్‌ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్‌ ట్రేడ్‌ టాక్‌.

Also read బాలయ్యకు ఫోన్ చేసిన రోజా.. మళ్ళీ వీళ్లిద్దరి రొమాన్స్
 
సేమ్ టు సేమ్ బాలయ్య కూడా అదే గేమ్ లో ఉన్నారు. ఆయన వరస సినిమాలు చేయటమే కాకుండా ఓ టాక్ షో కూడా ఓకే చేసారు. తెలుగువారి కోసమే ఓటీటీగా ప్రారంభమయ్యి.. పలు క్రియేటివ్ షోలతో ఆడియన్స్‌ను మెప్పిస్తోంది ఆహా. ఇప్పుడు అందులోనే హోస్ట్‌గా తన జర్నీని ప్రారంభించనున్నాడు బాలయ్య. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' పేరుతో ఒక టాక్ షోను ప్రారంభిస్తున్నారు. తాజాగా ఆ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు కూడా. ఇక బాలయ్య ఫ్యాన్స్ అంతా తనను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ షో కోసం బాలకృష్ణ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 

Also read ‘అఖండ’ రిలీజ్ కు మళ్లీ ట్విస్టా,ఇలా చేసారేంటి?బాలయ్య ఊరుకున్నాడా

 అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే భారీ లాంచింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం బాలకృష్ణ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్నది అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఒక్కో ఎపిసోడ్‌కు బాలయ్య బాబు రూ.40 లక్షలు తీసుకుంటునట్టు తెలుస్తుంది. బాలకృష్ణకు ఉన్న ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ భారీగానే ముట్టచెబుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios