Asianet News TeluguAsianet News Telugu

‘అఖండ’ రిలీజ్ కు మళ్లీ ట్విస్టా,ఇలా చేసారేంటి?బాలయ్య ఊరుకున్నాడా

సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. 

Why Balayya Akhanda  not in Diwali race?
Author
Hyderabad, First Published Oct 16, 2021, 1:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


నందమూరి అభిమానులుతో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ’. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న చిత్రం కావటంతో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్  రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ వున్నట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర టీమ్ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీపావళి కు సినిమా రిలీజ్ ఉంటుందని, దసరా రోజు  ‘అఖండ’ టీం నుంచి అప్‌డేట్ వస్తుందని,కొత్తి రిలీజ్ పోస్టర్ వదులుతారని అందరూ అంచనా వేసారు. కానీ అలాంటిదేమీ లేదు. 

Also read ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయకపోవడనికి కారణం అదే.. వివాదాలపై స్పందించిన విజయశాంతి

దాంతో ఇప్పుడు ఈ సినిమా దీపావళికి రిలీజ్ ఉంటుందో లేదో అన్న సందేహం అందరిలో మొదలైంది.  ముందు అనుకున్న ప్రకారమైతే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు. ఆ తర్వాత దసరా రిలీజ్ అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆపై దీపావళి మీదికి ఫోకస్ మళ్లింది. ఇప్పుడు ఇది కూడా తప్పితే సంక్రాంతి పోటీలో ఉండాలి. కానీ సంక్రాంతికి వరస క్యూ ఉంది. 

ఇక ఈ విషయమై ట్విట్టర్ లో ఫ్యాన్స్ నిర్మాతను ట్యాగ్ చేస్తూ,నిర్మాణసంస్దను ఉద్దేశించి ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు. అటు నుంచి నో రెస్పాన్స్. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘అఖండ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం జరుగుతుండటంతో దీపావళి విడుదల కష్టం అని సైలెట్ అయ్యారని తెలుస్తోంది. డిసెంబరు ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి ప్రకటన ఇస్తారని అంటున్నారు. ఇక దీపావళికి రజినీకాంత్ తమిళ  డబ్బింగ్ చిత్రం ‘పెద్దన్న’తో పాటు మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’, పూరి ఆకాశ్ మూవీ ‘రొమాంటిక్’లే మిగిలాయి.  చెప్పుకోదగ్గ తెలుగు పెద్ద సినిమా లేనట్లే. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా దీపావళి రేసులో లేకపోవడంతో నిరాశగా ఉన్నారు ఎగ్జిబిటర్స్.

Also read 'ఖైదీ' ప్రొడక్షన్ హౌస్ లో సమంత కొత్త చిత్రం!

సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.

 ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది.   ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల కు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని చెప్తున్నారు.  

Also read శ్రీయ శరన్ కిల్లింగ్ లుక్స్.. ఎంత అందంగా ఉందో కదా, ఆ విషయంలో మంచు లక్ష్మి సపోర్ట్

మరో ప్రక్క ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios