కరోనా వైరస్ దెబ్బకు సినీ పరిశ్రమ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఇన్నేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పరిశ్రమకి  చెందిన ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా ప్రభావం తగ్గితే కాని మళ్లీ పనులు మొదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోందనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. దీనిపై ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.  
కరోనా తర్వాత సినీ పరిశ్రమ గతంలో మాదిరి ఉండబోదని 'బాహుబలి' నిర్మాత శోభు చెప్పారు. ‘కొవిడ్ తర్వాత ఫిల్మ్ మార్కెటింగ్ ఎలా ఉండబోతోంది ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెటింగ్ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నా. ప్రీ-రిలీజ్ వేడుకలు ఆడియో విడుదల కార్యక్రమాలు థియేటర్స్ మాల్స్కు వెళ్లడం రోడ్ ట్రిప్లు.. ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాలను నిర్వహించడం కుదరదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి’ అని ఆయన తెలిపారు. 

 కోవిడ్ 19 తర్వాత చిత్ర పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అంటున్నారు. సినిమాకి సంబంధించిన కార్యక్రమాలను ఇక ముందు పెద్ద ఎత్తున నిర్వహించలేమని తేల్చి చెప్పారు. కరోనా జీవితంలో అందరి జీవన విధానంలో ఊహించని మార్పులు తీసుకొచ్చింది. సామాన్యుడి దగ్గర్నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికి భయం బాద్యత తెలియచెప్తోంది. అంతేకాదు కరోనా ప్రభావం దేశంలోని అన్నీ వ్యాపార రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీని ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆపేయడం.. అన్ని భాషల్లో రిలీజ్ అవ్వాల్సిన ఎన్నో సినిమాలను వాయిదా వేసుకోవడం తో నిర్మాతలకి బాగానే నష్టం వాటిల్లింది.
 అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం శోభూ యార్లగడ్డ నిర్మిస్తున్న తాజా చిత్రం “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.