షాకిచ్చిన ‘సలార్’ఆంధ్రా బిజినెస్,నిరాశలో నిర్మాత ?
ఆంధ్రా,సీడెడ్ కలిపి 135 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తే అది 100 కోట్ల దగ్గరే ఆగిందిట. 35 కోట్లు తగ్గిందిట. అందుకు కారణం... ఆంధ్రాలో ఆ మధ్యన ఇచ్చిన G.O నే అంటున్నారు.

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. దాంతో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ విషయంలో నిర్మాతలు ఆంధ్రా సైడ్ నుంచి మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ల అనుకున్న రేటు రాలేదని ఫీల్ అవుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
సలార్ నిర్మాతలు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి 200 కోట్ల దాకా బిజినెస్ ఎక్సపెక్ట్ చేసారట. అందులో నైజాం నుంచి 65 కోట్లు, సీడెడ్ నుంచి 35 కోట్లు, ఆంధ్రా ఆరు ప్రాంతాల కలిపి 100 కోట్ల రేషియో లెక్కలు వేసారట. అయితే నైజాం మాత్రం వాళ్ల అనుకన్నట్లే నైజాం రీజియన్‌లో ఈ సినిమా హక్కులను మైత్రీ మూవీస్ 65 కోట్ల ఎన్నారై (నాన్-రిఫండబుల్ అడ్వాన్స్) కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఆంధ్రా,సీడెడ్ కలిపి 135 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తే అది 100 కోట్ల దగ్గరే ఆగిందిట. 35 కోట్లు తగ్గిందిట. అందుకు కారణం... ఆంధ్రాలో ఆ మధ్యన ఇచ్చిన G.O నే అంటున్నారు. ఆ G.O ప్రకారం టిక్కెట్ రేట్లు తెలంగాణాతో పోలిస్తే బాగా తక్కువ. అలాగే గవర్నమెంట్ మిడ్ నైట్ షోలు ,టిక్కెట్ రేట్లు మరీ ఎక్కువ పెంచటానికి అవకాసం ఇ్వదు. దాంతో ఈ G.O ప్రభావంతో డిస్ట్రిబ్యూటర్స్ అన్ని రకాల లెక్కలు వేసుకుని తక్కువకు అడగటం జరిగిందిట. దాంతో సలార్ నిర్మాతలు ఇది ఊహించని పరిణామం కావటంతో షాక్ అయ్యారని వినికిడి.
ఏదైమైనా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రభాస్ పెద్ద డిజాస్టర్ అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం.