టాలీవుడ్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. సినిమా ఎప్పుడొస్తుందా.. అని రెబల్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాపై ఉన్న క్రేజ్ ఎక్కడా తగ్గకుండా స్పెషల్ ప్రమోషన్స్ చేస్తోంది. 

రిలీజ్ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్స్ డోస్ ఎలా పెంచాలో యూవీ క్రియేషన్స్ చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఇప్పుడు సాహో గేమ్ ని కూడా విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 15న సినిమాకు సంబందించిన ఎదో టీజర్ ని వదులుతారనుకుంటే గేమ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఒక టీజర్ ద్వారా ఎనౌన్సమెంట్ ఇచ్చారు. 

PIXALOT తో కలిసి సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా డిజైన్ చేసిన సాహో THE GAME ను ఆగస్ట్ 15న  చేయబోతున్నట్లు చెప్పారు. అందుకు సంబందించిన టీజర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇక సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమాను వంశీ - ప్రమోద్ లో నిర్మించారు.

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్