Asianet News TeluguAsianet News Telugu

ఈ 50 కోట్ల రచ్చ ఏంటి డార్లింగ్?!!

 ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ అందులో ఏ ఒక్క మూవీ నుండి కూడా ఫ్యాన్స్‌కు సరైన అప్డేట్ లేదు.  దాంతో రాధే శ్యామ్ టీజర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మూవీ టీమ్.. దాంతో పాటు సినిమా విడుదల తేదీలో ఏ మార్పు లేదని కూడా స్పష్టం చేసింది. 

Rs 50 Cr for 15 Minutes Radhe Shyam climax?
Author
Hyderabad, First Published Oct 21, 2021, 8:16 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం అనేక అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అలాగే  జనవరి 14న విడుదల కూడా ఫిక్స్ చేసారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రేపు అంటే అక్టోబర్ 22న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేస్తారు. ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య పాత్ర పరిచయం ఉంటుందని అన్నారు. ఈ లోగా ఓ న్యూస్ మీడియాలో ఈ సినిమా గురించి హల్ చల్ చేస్తోంది.

అదేంటంటే...ఈ చిత్ర క్లైమాక్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారట. ఎంత భారీగా అంటే ఏకంగా 15 నిమిషాల ఎపిసోడ్ కోసం 50 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఓ రేంజిలో ఉంటుందని చెప్తున్నారు. ఈ క్లైమాక్స్ చూస్తే సినిమా హిట్ అన్న నిర్ణయానికి వచ్చేస్తారని, అంత భారీగా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంతగా ఉంటుందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకూ నిజం అనేది ఓ వర్గం అంటోంది. 

ఎంత పాన్ ఇండియా సినిమా అయినా అంత ఖర్చు పెడతారా... అయితే ఇదేమీ అఫీషియల్ గా నిర్మాతలు వదలిన ప్రకటన కూడా కాదు...మీడియాలో తయారైన మ్యాటరా లేక పీఆర్ టీమ్ ..సినిమాపై హైప్ క్రియేట్ చేయటానికి వదిలిన బాణమా అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి హైప్ కూడా సినిమాని దెబ్బ కొడుతుంది.  అంత ఖర్చు పెట్టి తీసారు అని చూస్తే ఆ క్లైమాక్స్ ఎంత అద్బుతంగా ఉన్నా ఈ ఎక్సపెక్టేషన్స్ కు రీచ్ కాకపో అంత  వర్త్ లేదని అనేస్తారు. కాబట్టి కాస్తంత ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

Also read చెంప పగిలిపోద్ది.. దమ్ముంటే కొట్టి చూడు, శృతి మించిన సన్నీ, ప్రియా యుద్ధం.. మూసుకొని కూర్చున్నాడు అంటూ..

ఇక తాజాగా అక్టోబర్ 23న 'రాధే శ్యామ్' టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఆరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో తాను నటిస్తున్న ఆదిపురుష్, సలార్ నుండి కూడా ఏదో ఒక అప్డేట్ ఉండవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్ త్వరత్వరగా పూర్తవుతోంది కాబట్టి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్.
 Also read నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..
ఎందుకంటే  ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ అందులో ఏ ఒక్క మూవీ నుండి కూడా ఫ్యాన్స్‌కు సరైన అప్డేట్ లేదు.  దాంతో రాధే శ్యామ్ టీజర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మూవీ టీమ్.. దాంతో పాటు సినిమా విడుదల తేదీలో ఏ మార్పు లేదని కూడా స్పష్టం చేసింది. అక్టోబర్‌లో విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్‌' సంక్రాంతికి పోస్ట్‌పోన్ అవ్వడంతో మిగతా సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉందనుకున్నారు మూవీ లవర్స్. కానీ ఆర్ఆర్ఆర్‌తో తలబడడానికి రాధే శ్యామ్ సిద్ధమయ్యింది. ఇక టీజర్‌ను అనౌన్స్ చేస్తూ విక్రమాదిత్య ఎవరో తెలుసుకోవాలంటే 23 వరకు ఆగమని డైరెక్టర్ రాధాకృష్ణ అన్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios