MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెంప పగిలిపోద్ది.. దమ్ముంటే కొట్టి చూడు, శృతి మించిన సన్నీ, ప్రియా యుద్ధం.. మూసుకొని కూర్చున్నాడు అంటూ..

చెంప పగిలిపోద్ది.. దమ్ముంటే కొట్టి చూడు, శృతి మించిన సన్నీ, ప్రియా యుద్ధం.. మూసుకొని కూర్చున్నాడు అంటూ..

Bigg Boss 5 Telugu అక్టోబర్ 20 ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నేటి ఎపిసోడ్ కోడి గుడ్ల టాస్క్ తో మొదలవుతుంది. హౌస్ లో జరిగే ఫన్నీ గేమ్ ని లోబో సీక్రెట్ రూమ్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటాడు.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 20 2021, 11:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Bigg Boss 5 Telugu అక్టోబర్ 20 ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నేటి ఎపిసోడ్ కోడి గుడ్ల టాస్క్ తో మొదలవుతుంది. హౌస్ లో జరిగే ఫన్నీ గేమ్ ని లోబో సీక్రెట్ రూమ్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. బిగ్ బాస్.. 5 అదనపు గుడ్లు పొందే టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ లో విశ్వ, కాజల్ పాల్గొంటారు. టాస్క్ ప్రకారం నిర్ణీత సమయంలో ఎవరు ఎక్కువ బట్టలు ధరిస్తే వారు విజేత. విజేతకు ఐదు అదనపు ఎగ్స్ లభిస్తాయి. ఈ టాస్క్ లో విశ్వ 106 బట్టలు ధరించి విజేతగా నిలుస్తాడు. కాజల్ కేవలం 79 దుస్తులకే పరిమితం అవుతుంది. 

26

ఇంటి సభ్యులంతా కోడి నుంచి గుడ్లు సేకరించే పనిలో ఉంటారు. వారు పొందిన గుడ్లని బుట్టలో దోచుకుంటుంటారు. ఈ లోపు బిగ్ బాస్.. జెస్సికి సీక్రెట్ గా ఓ టాస్క్ ఇస్తారు. హౌస్ లో ముగ్గురు సభ్యులని ఎంచుకుని వారి వద్ద గుడ్లు లేకుండా చేయాలి. అలా చేస్తే నేరుగా కెప్టెన్సీ టాస్క్ కు ఎంపికయ్యే అవకాశం లభిస్తుంది అని జెస్సీకి బిగ్ బాస్ చెబుతారు. అవసరమైతే ఈ సీక్రెట్ టాస్క్ లో ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు అని చెబుతారు. దీనితో జెస్సి.. Siri హెల్ప్ తీసుకుంటాడు. షణ్ముఖ్, ప్రియాంక, ప్రియా లని జెస్సి టార్గెట్ చేస్తాడు. సిరి సాయంతో వారి నుంచి గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. 

36

ఇంతలో సన్నీ, ప్రియా మధ్య పెద్ద గొడవ చెలరేగుతుంది. Priya.. Sunny బుట్టని చించివేసే ప్రయత్నం చేస్తుంది. దీనితో సన్నీ ఆమెని నెట్టివేస్తాడు. వెంటనే ప్రియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఫిజికల్ గా అటాక్ చేస్తే చెంప పగిలిపోతుంది అంటూ ఘాటుగా కామెంట్ చేస్తుంది. దీనితో సన్నీ కూడా ఘాటుగా స్పందిస్తాడు. నోరు అదుపులో పెట్టుకోమని ప్రియకు వార్నింగ్ ఇస్తాడు. చేతకాని ముఖాలు హౌస్ లోకి వస్తారు అంటూ సన్నీ ఫైర్ అవుతాడు. దీనితో ప్రియా మాటిమాటికి చెంప పగిలిపోద్ది అంటూ సన్నీని తిడుతూనే ఉంటుంది. దమ్ముంటే వచ్చి కొట్టు అని సన్నీ అంటాడు. 

46

అలాగే సిరి, జెస్సిలతో కూడా సన్నీకి గొడవ జరుగుతుంది. సన్నీ గుడ్లని సిరి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. నేను ఆడవాళ్ళ జోలికి రాను.. గాయపడతావు జాగ్రత్త అని సన్నీ సిరికి చెబుతాడు. ఆ తర్వాత సిరి.. సన్నీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సన్నీ, జెస్సి మధ్య మతాల యుద్ధం జరిగేటప్పుడు కూడా సిరి సన్నీని రెచ్చగొడుతూనే ఉంటుంది. 

56

ఇక జెస్సి సన్ని విషయంలో వెనక్కి తగ్గడు. సన్నీకి ఆడవాళ్లు భయపడతారేమో నేను కాదు.. గట్టిగా అరిచేసరికి అన్ని మూసుకుని కూర్చున్నాడు అని జెస్సి.. మానస్ తో అంటాడు. సన్నీతో జరిగిన గొడవ వల్ల ప్రియా కంటతడి పెట్టుకుంటుంది. ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. అందరితో గొడవ పడడం ఎమోషనల్ గా డ్రామా చేయడం అని సన్నీ కామెంట్ చేస్తాడు. 

66

ఇదిలా ఉండగా గేమ్ ని Ravi చూస్తూ గమనిస్తుంటాడు. సిరితో సీక్రెట్ డీల్ కుదుర్చుకుంటాడు. తప్పో ఒప్పో నాకు తెలియదు. నువ్వు ఒకే చెబితే ఓ ఓ డీల్ చేసుకుందాం అంటాడు. దీనికి సిరి ఒకే చెబుతుంది. హౌస్ లో ఎగ్స్ ఎక్కడ దాచిపెట్టారో రవి.. సిరికి చెబుతాడు. ఆ గుడ్లని సిరి దొంగిలించి.. కొన్నింటిని రవికి ఇస్తుంది. ఈ గేమ్ మొత్తాన్ని లోబో సీక్రెట్ రూమ్ నుంచి గమనిస్తూ ఉంటాడు. చివరగా బిగ్ బాస్ మరో టాస్క్ ఇస్తారు. ఇది బాతు టాస్క్ . ఈ టాస్క్ లో శ్రీరామ్, అనీ మాస్టర్ పోటీ దారులు. ఇద్దరికీ బాతు బొమ్మలని ప్లేట్ పై పెట్టి ఇస్తారు. ఇద్దరూ రింగ్ లోకి ఎంటర్ అయ్యాక ఎవరి బాతు బొమ్మని వారు రక్షించుకోవాలి. కింద పడిపోకుండా చూసుకోవాలి. ప్రత్యర్థి బాతు బొమ్మని కింద పడేయడానికి ప్రయత్నించవచ్చు. అలా బాతుని ఎవరు ఎక్కువ సేపు రక్షించుకోగలరో వారే విజేత. ఈ పోటీలో అనే మాస్టర్ విజయం సాధిస్తుంది. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Recommended image2
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved