Asianet News TeluguAsianet News Telugu

నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది.

Nayanthara to marry a tree before vignesh shivan
Author
Hyderabad, First Published Oct 20, 2021, 6:23 PM IST

స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది Nayanthara. అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకే హీరోయిన్ నయనతార. ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోంది. 

ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు Vignesh Shivan తో చాలా కాలంగా నయనతార ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మరికొన్ని నెలల్లో నయనతార, విగ్నేష్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ప్రేమికులంటే ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కానీ నయన్, విగ్నేష్ మాత్రం గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. 

దీనిపై ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నయనతారకు కుజ దోషానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయట. దీనితో కొంతమంది జ్యోతిష్యులు విగ్నేష్ శివన్ కంటే ముందుగా నయనతార ఓ చెట్టుని వివాహం చేసుకోవాలని సూచిస్తున్నారట. నయన్ కూడా జ్యోతిష్యుల సలహాకి ఓకె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విగ్నేష్ శివన్ క్షేమం కోసమే నయన్ చెట్టుతో పెళ్ళికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

నయన్ కు హిందూ మత ఆచారాలపై నమ్మకం ఎక్కువ. క్రిస్టియన్ ఫ్యామిలిలో జన్మించిన నయన్ ఆ తర్వాత హిందూగా కన్వర్ట్ అయింది. కుజ దోషానికి సంబంధించిన పూజల కోసమే నయన్, విగ్నేష్ జంట దేశంలోని ఆలయాలని సందర్శిస్తున్నారు. ఇటీవలే ఈ జంట తిరుమల శ్రీవారిని సందర్శించుకోగా.. తాజాగా షిరిడి సాయి బాబాను దర్శించుకున్నారు.అనంతరం ముంబైలో మహాలక్ష్మి ఆలయం, సిద్ది వినాయక్ టెంపుల్ ని సందర్శించారు. 

Also Read: మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

గతంలో మాజీ ప్రపంచ సుందరి Aishwarya Rai కి కూడా మొదట చెట్టుతో వివాహం జరిగింది. దోష నివారణ కోసం ఆమెకు చెట్టుతో పెళ్లి చేశారు. ఆ తర్వాతే అభిషేక్ తో మ్యారేజ్ జరిగింది. ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకోవడం అప్పట్లో వివాదానికి దారితీసింది కూడా. 

Follow Us:
Download App:
  • android
  • ios