MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?

Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?

Anchor Suma: దాదాపు 30 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల. కానీ వీరి పెళ్లికి ముందు జరిగిన సంఘటన గురించి మీకు తెలుసా? సుమకు రాజీవ్ పెట్టిన కండీషన్ ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 01 2026, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాంకరింగ్ క్వీన్ గా సుమ కనకాల..
Image Credit : KanakalaSuma/instagram

యాంకరింగ్ క్వీన్ గా సుమ కనకాల..

తెలుగు బుల్లితెరపై ‘సుమ కనకాల’ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా తన సమయస్ఫూర్తి, చమత్కారం, అద్భుతమైన వాక్చాతుర్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ‘యాంకరింగ్ క్వీన్’గా వెలుగు వెలుగుతుంది సుమ. టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు.. స్టార్ హీరోల ప్రీరిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్స్ ఇలా ఒక్కటి కాదు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమున్నా హోస్ట్ గా సుమనే గుర్తుకు వస్తుంది ఎవరికైనా. ఇక సుమ అంత స్టార్ యాంకర్ కదా.. మరి సినిమాల్లో ఎందుకు రాణించలేకపోయింది. ఆమె జీవితంలో పెళ్లికి ముందు జరిగిన ఒక ఆసక్తికర సంఘటన, అలాగే ఆమె సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే విషయాలు పలుసందర్భాలలో సుమ అభిమానులతో షేర్ చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లికి ముందే రాజీవ్ కనకాల పెట్టిన కండీషన్!
Image Credit : others

పెళ్లికి ముందే రాజీవ్ కనకాల పెట్టిన కండీషన్!

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ, తన ప్రేమ ప్రయాణంలోని ఒక ఆసక్తికరమైన గొడవ గురించి వెల్లడించింది. 1995-96 ప్రాంతంలో రాజీవ్ కనకాల తనకు ప్రపోజ్ చేశారని, ఏడాది పాటు తమ సంబంధం బాగానే సాగిందని ఆమె తెలిపారు. అయితే ఒక రోజు రాజీవ్ పెళ్లి తరువాత "నువ్వు సినిమాలు చేయకూడదు" అని ఒక షరతు పెట్టినట్టు ఆమె వెల్లడించారు. ఆ కండీషన్ విని తాను షాక్ అయ్యాని అన్నారు. ఆతరువాత చాలా ఆలోచించానన్నారు.

35
సినిమాల్లో నటిద్దామని రెడీ అవుతుండగా..
Image Credit : facebook.com/SumaKanakala

సినిమాల్లో నటిద్దామని రెడీ అవుతుండగా..

అప్పటికి సుమ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని, డిగ్రీ అయ్యాక సినిమాలు చేద్దామని అనుకుంటున్న సమయమది. "పెళ్లికి ముందే ఇలా ఆంక్షలు విధిస్తున్నారంటే... పెళ్లయ్యాక ఇంకెన్ని ఆంక్షలు పెడతారో" అని భావించిన సుమ, వెంటనే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నారట. రాజీవ్‌కు తెగేసి చెప్పారట. ఆత్మగౌరవాని చాలా విలువిలువిస్తుంది సుమ. అంతే కాదు ప్రేమపై కూడా ఆమెకు నమ్మకం ఎక్కువ అందుకే వారిద్దరి మధ్య సర్దుబాటు జరిగి వివాహబంధంతో ఒకటయ్యారు.

45
సుమ సినిమాల్లో రాణించలేకపోవడానికి కారణం ఏంటి?
Image Credit : our own

సుమ సినిమాల్లో రాణించలేకపోవడానికి కారణం ఏంటి?

హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ, సుమ వెండితెరకు దూరమై బుల్లితెరకు పరిమితమయ్యారు. దీనిపై సుమ స్పందిస్తూ – సినిమాలు చేయడం తన వల్ల కాదని త్వరగానే గ్రహించానని వెల్లడించారు. షూటింగ్ లోకేషన్లలో గానీ, వివిధ విభాగాల్లో పనిచేసేటప్పుడు గానీ తాను అంత సౌకర్యవంతంగా (Comfortable) ఫీల్ కాలేకపోయానని సుమ అన్నారు.

 సినిమాలో నటించేటప్పుడు తన నటన కొంత బిగుతుగా (Stiff) ఉండేదని, లోలోపల ఒక విధమైన భయం (Fear) ఉండేదని స్టార్ యాంకర్ ఒప్పుకున్నారు. సినిమా రంగం తన "కప్ ఆఫ్ టీ" (Cup of Tea) కాదని గ్రహించిన సుమ, తనకు బాగా ఇష్టమైన, పూర్తి స్వేచ్ఛనిచ్చే బుల్లితెర వైపు అడుగులు వేశారు.

55
యాంకర్ గా తిరుగులేని స్టార్‌డమ్
Image Credit : Asianet News

యాంకర్ గా తిరుగులేని స్టార్‌డమ్

సినిమాలకు దూరమైనా, టెలివిజన్ రంగాన్ని తన సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారు సుమ. టీవీ షోలు, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు ఏవైనా సరే "సుమ ఉంటే ఆ వేడుక సూపర్ హిట్" అనే స్థాయికి ఎదిగారు. బడా హీరోల నుంచి వర్ధమాన నటుల వరకు అందరి సినిమా ఈవెంట్లలో.. తన టైమింగ్, హ్యూమర్‌తో అలరిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రాజీవ్ కనకాల భార్యగా ఫ్యామిలీ బాధ్యతలను నిర్వహిస్తూనే.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను సమన్వయం చేసుకుంటూ నేటి మహిళలకు సుమ ఒక ఆదర్శంగా నిలిచారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Related Stories
Recommended image1
Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved