సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా రాజమౌళి తనయుడి పెళ్లి వేడుకలకు సంబందించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి. తనయుడు కార్తికేయ పెళ్లి కోసం స్టార్ సెలబ్రెటీలు షూటింగ్ లకు బ్రేక్ చెప్పి మరి జై పూర్ లో వాలిపోయారు. నేడు రాత్రి ఘనంగా వివాహం జరగనుంది. 

అయితే రీసెంట్ గా జరిగిన సంగీత్ లో RRR డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - అలాగే చరణ్ కలిసి స్టెప్పులేశారు. వీరు ముగ్గురు ఎంత సన్నిహితంగా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి టీమ్ కూడా పెళ్లి వేడుకకు హాజరు కానుంది. ఇక RRR డ్యాన్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. 

మొత్తానికి కార్తికేయ వివాహం ఏ రేంజ్ ;లో జరుగుందో ఈ వీడియోల ద్వారా చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. రామ్ చరణ్ - రాజమౌళి - జూనియర్ డ్యాన్స్ వీడియో ఎలా ఉందొ కింద ఇచ్చిన లింక్ లో చూడవచ్చు. 

సంబంధిత వార్తలు

రాజమౌళి కొడుకు పెళ్లిలో తారక్ రచ్చ చూశారా..? 

రాజమౌళి, రామ్ చరణ్ డాన్స్ చూశారా..?

పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!