డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి రియా  చక్రవర్తి ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల అదుపులో ఉన్నారు. కాగా రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ కోసం అప్లై చేసుకోగా కోర్ట్ తిరస్కరించింది. ఆమెను 14రోజుల జ్యుడిషల్ కస్టడీకి అప్పగించడం జరిగింది. దీనితో రియా చక్రవర్తి తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తుంది. 

ఇప్పటికే రియా చక్రవర్తి బ్రదర్ షోవిక్ చక్రవర్తిని కూడా అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షోవిక్ మరియు రియా చక్రవర్తి తమకు డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో ఒప్పుకున్నారని సమాచారం. అలాగే కొందరు బాలీవుడ్ ప్రముఖులకు వీరు డ్రగ్స్ సప్లై చేసినట్లు వెల్లడించడం సంచలనం రేపుతోంది. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ కి చెందిన అనేకమంది ప్రముఖులలో గుబులు మొదలైంది. మరింత విచారణ జరగనుండగా మరికొందరు ఈ డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కునే అవకాశం కలదని తెలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యతో మొదలైన ఈ కేసు డ్రగ్స్ కేసుగా మారిపోయింది.