Asianet News TeluguAsianet News Telugu

రెండు వారాల నుంచి రామోజీరావుకు పూర్తి రిలీఫ్

ఈనాడు గ్రూప్ తో పాటు రామోజి ఫిల్మ్ సిటీ వంటి అనేక వ్యాపారాలు ఒంటి చేత్తో నిర్వహిస్తున్న రామోజీరావు కు అదే ఇబ్బంది ఎదురైంది. ఆయన వ్యాపారాలన్నటిపైనా కరోనా బాగా దెబ్బ కొట్టింది. పేపరు సర్కులేషన్ తగ్గటమే కాకుండా, రామోజీ  ఫిల్మ్ సిటీ సైతం పూర్తిగా డల్ అయ్యిపోయింది. దాంతో ఎంప్లాయిస్ కు జీతాలు ఇవ్వటం ఓ టైమ్ లో కష్టమైపోయింది. కాస్ట్ కట్టింగ్ చర్యలు చేపట్టి కొద్దిలో కొద్ది ఒడ్డున పడే ప్రయత్నం చేసారు.
 

RFC busy again , ramoji rao get big relief
Author
Hyderabad, First Published Oct 1, 2020, 9:06 AM IST

ఎన్నో కోట్లు వెచ్చించి పెట్టిన వ్యాపారాలు డల్ గా ఉంటే ఎవరికైనా మనస్సాంతి ఉండదు. గత ఆరేడు నెలలుగా కరోనా దెబ్బతో బిగ్ షాట్స్ అనుకునే ఇండస్ట్రలియస్ట్ లు సైతం బెంగ పెట్టుకునే పరిస్దితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈనాడు గ్రూప్ తో పాటు రామోజి ఫిల్మ్ సిటీ వంటి అనేక వ్యాపారాలు ఒంటి చేత్తో నిర్వహిస్తున్న రామోజీరావు కు అదే ఇబ్బంది ఎదురైంది. ఆయన వ్యాపారాలన్నటిపైనా కరోనా బాగా దెబ్బ కొట్టింది. పేపరు సర్కులేషన్ తగ్గటమే కాకుండా, రామోజీ  ఫిల్మ్ సిటీ సైతం పూర్తిగా డల్ అయ్యిపోయింది. దాంతో ఎంప్లాయిస్ కు జీతాలు ఇవ్వటం ఓ టైమ్ లో కష్టమైపోయింది. కాస్ట్ కట్టింగ్ చర్యలు చేపట్టి కొద్దిలో కొద్ది ఒడ్డున పడే ప్రయత్నం చేసారు.

ఈ సిట్యువేషన్ కాస్తంత లాభాల బాటలో నడిచింది ఈటీవి మాత్రమే. ఫిల్మ్ సిటీ మాత్రం బాగా దెబ్బకొట్టిందని సమాచారం. షూటింగ్ లు లేక, పర్యాటకులు లేక ఫిల్మ్ సిటీ వెలాతెలా పోయింది. అలాగని ఎంప్లాయిస్ ని తీసేసే పరస్తితి లేదు. రేపు పరిస్దితిలు చక్కబడ్డాక అప్పటికప్పుడు ఎంప్లాయిస్ దొరకమంటే దొరకరు. ఈ నేపధ్యంలో ఆయన ఈ ఫిల్మ్ సిటీ విషయమై కోట్ల రూపాయలు ...ఖర్చు పెడుతూ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. 
 
అయితే ఆ పీరియడ్ అయ్యిపోయింది. అన్ లాక్ పక్రియలో భాగంగా షూటింగ్ లకు ఫర్మిషన్ ఇచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింట్ లు మొదలెడుతున్నారు. గత రెండు వారాల్లో ఆర్ ఎఫ్ సీలో షూటింగ్ లు కంటిన్యూ జరుగుతున్నాయి. మళ్లీ అన్ని ప్లోర్ లు బిజీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో అవుట్ డోర్ షూటింగ్ కు అవకాసం లేదు కాబట్టి..అందరూ రామోజీ ఫిల్మ్ సిటీ వైపే చూస్తున్నారు. లోకల్ సిటీల్లో ఉన్న స్టూడియోల కన్నా రామోజీ పిల్మ్ సిటీ సురక్షితం అని భావించటం కలిసొచ్చింది. 
 
కేవలం తెలుగు వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్లు సైతం ఇక్కడకు షూటింగ్ లకు రావటం ఫిల్మ్ సిటీకు బాగా ప్లస్ అవుతోంది. దాంతో అతి త్వరలోనే లాక్ డౌన్ నష్టాలను రామోజీరావు పూడ్చుకుంటారని అందరూ అంచనా వేస్తున్నారు. అంటే రామోజీ రావుకు భారీగా రిలీఫ్ వచ్చినట్లే. 

Follow Us:
Download App:
  • android
  • ios