Asianet News TeluguAsianet News Telugu

రామారావు కి జంటగా ఇద్దరు భామలు!

రామారావు మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలను నేడు పరిచయం చేశారు. మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ చేస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. తాజాగా రజీష విజయన్ ఈ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు. 

raviteja to romance two heroin in ramarao team came up with an update ksr
Author
Hyderabad, First Published Jul 19, 2021, 1:39 PM IST

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. రవితేజ 68వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల రామారావు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు టైటిల్ రివీల్ చేశారు. సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా రవితేజ లుక్ ఆకట్టుకుంది. అలాగే రామారావు షూటింగ్ కూడా షురూ అయ్యింది. 


కాగా రామారావు మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలను నేడు పరిచయం చేశారు. మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ చేస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. తాజాగా రజీష విజయన్ ఈ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు.  మలయాళ  హీరోయిన్ గా పలు హిట్ చిత్రాలలో నటించి రజీష మంచి క్రేజ్ సంపాదించుకుంది.  సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. 


మరోవైపు రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఖిలాడి చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తుండగా, యాంకర్ అనసూయ కీలక రోల్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios