MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మామిడి పండ్లు తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా?

మామిడి పండ్లు తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా?

మార్కెట్ లోకి రకరకాల మామిడి పండ్లు వస్తున్నాయి. ముండే ఈ సీజన్ పోతే మళ్లీ మామిడి పండ్లు దొరకవని ఈ పండ్లను రెగ్యులర్ గా తింటుంటారు. మరి ఈ మామిడి పండ్లను డయాబెటీస్ ఉన్నవారు తినొచ్చా? ఇవి తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 08 2024, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మామిడి పండ్లు సాధారణంగా తీయగా ఉంటాయి. అందుకే వీటిని తింటే షుగర్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటుంటారు. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటికి దూరంగా ఉంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను ధైర్యంగా తినొచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

డయాబెటిస్ ఉన్నవారు ఏదైనా తినడానికి చాలా భయపడిపోతుంటారు. షుగర్ పేషెంట్లు స్టార్చ్ తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినొచ్చా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36

మామిడి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో ఐరన్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు, నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ మామిడి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

46

అందుకే డయాబెటిక్ పేషెంట్లు వీలైనంత వరకు మామిడి పండ్లను తినకపోవడమే మంచిది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు.

56

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని ఇతర పండ్లు..

మధుమేహులు  మామిడి పండ్లతో పాటుగా వేరే కొన్ని పండ్లను కూడా తినకూడదు. అరటిపండ్లు, పైనాపిల్స్ వంటి పండ్లలో కూడా నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వీటిని లిమిట్ లోనే తినాలి. 
 

66

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే కొన్ని పండ్లు 

డయాబెటీస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను  ఖచ్చితంగా తినాలి. వీటిలో ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆపిల్, నారింజ, నిమ్మకాయలు, దానిమ్మ, చెర్రీలు, పీచెస్, కివి మొదలైన పండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. 

గమనిక: ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved