రెండు ఇంటర్వెల్స్ తో రష్మిక మందన్నా సినిమా.. సరికొత్త సంచలనం.. ?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటించిన `యానిమల్‌` మూవీకి సంబంధించిన ఆసక్తికర, షాకింగ్‌ విషయం లీక్‌ అయ్యింది. ఇంటర్వెల్స్, సినిమా నిడివి గురించే చర్చ జరుగుతుంది.

rashmika mandanna starrer movie coming with two intervals ? arj

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హిందీలో నటించిన రెండు సినిమాలు వర్కౌట్‌ కాలేదు. ఆమె ఇప్పుడు `యానిమల్‌` మూవీతో రాబోతుంది. `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన మూవీ ఇది. రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ మూవీ. తండ్రి కొడుకుల మధ్య ఫైటింగ్‌ ప్రధానంగా సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదల కాబోతుంది. 

ఈ నేపథ్యంలో `యానిమల్‌` మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూవీ నిడివి ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ప్రస్తుతం మూడు గంటల సినిమా ఉంటేనే వామ్మో ఇంత లెంన్తీనా అనే ఆశ్చర్యపోతున్నారు ఆడియెన్స్. బోరింగ్‌ అంటూ పెదవి విరుస్తున్నారు. కొన్ని సినిమాలకు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటిది మూడున్నర గంటలంటే నోరెళ్ల బెట్టాల్సిందే. అవును `యానిమల్‌` మూవీ ఏకంగా మూడు గంటల 21 నిమిషాల నిడివితో ఉంటుందట. 

ఇందులో మూడు గంటల 15నిమిషాలు సినిమా, మిగిలిన ఆరు నిమిషాలు ముందు, వెనకా టైటిల్స్ ఉంటాయట. ఇంతటి లెంన్తీ సినిమా చూడాలంటే ఆడియెన్స్ కి ఇబ్బందే. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా థియేటర్లో కూర్చోవడం కష్టంగానే ఉంటుంది. దీంతో ఆ ఫీలింగ్‌ సినిమాపై ఆడియెన్స్ లో ఆసక్తిని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఓ స్పెషల్‌ ప్లాన్‌ చేసిందట యూనిట్‌. ఈ సినిమాకి రెండు ఇంటర్వెల్స్ ప్లాన్‌ చేసిందట. గంటల పది, పదిహేను నిమిషాల గ్యాప్‌తో రెండు ఇంటర్వెల్స్ పెట్టినట్టు తెలుస్తుంది. 

Read more: `జబర్దస్త్` రష్మితో పెళ్లి.. అమ్మాయిల హార్ట్ బ్రేక్‌ అయ్యే స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సుడిగాలి సుధీర్‌..

ప్రస్తుతం ఆ రకంగానే సినిమా ఫైనల్‌ వర్క్ జరుగుతుందట. ఆ మేరకు థియేటర్ల అడ్జెస్ట్ మెంట్‌ కూడా జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇంతటి లెంన్తీ సినిమా రావడం, పైగా రెండు ఇంటర్వెల్స్ తో మూవీ రావడం తెలుగులో మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే ఈ ట్రెండ్‌ గతంలో బాలీవుడ్‌లో ఉంది. రాజ్‌ కుమార్‌ రూపొందించిన చాలా సినిమాలు ఇలా రెండు ఇంటర్వెల్స్ తో వచ్చాయి. అప్పట్లో అదొక ట్రెండ్‌లా వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అలా ఏ సినిమా రాలేదు. దీంతో `యానిమల్‌` మూవీ చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అనేది చూడాలి. ఇది వర్కౌట్‌ అయితే ఇలానే చాలా సినిమాలు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. థియేటర్లకి మాత్రం కష్టాలే. 

Also read: Pushpa 2: పుష్ప 2లో అదే హైలెట్... గంగమ్మ జాతర సీన్ లీక్ చేసిన దేవిశ్రీ!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios