`జబర్దస్త్` రష్మితో పెళ్లి.. అమ్మాయిల హార్ట్ బ్రేక్ అయ్యే స్టేట్‌మెంట్ ఇచ్చిన సుడిగాలి సుధీర్..
యాంకర్ రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ లవ్ లో ఉన్నారని అంతా భావిస్తున్నారు. `జబర్దస్త్` షోలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అంతగా పండింది. ఈ నేపథ్యంలో రష్మితో పెళ్లిపై తాజాగా సుడిగాలి సుధీర్ స్పందించారు.
`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మంది లైఫ్ ఇచ్చింది. దాని ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్, రష్మి, అనసూయ, హైపర్ ఆది వంటి వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ షో జంటలను బిల్డ్ చేయడంలో ఎక్స్ పర్ట్ గా నిలిచింది. సుధీర్, రష్మిల మధ్య కెమిస్ట్రీని ఇందులో బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో ఈ ఇద్దరిని జబర్దస్త్ బాగా వాడుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరు కూడా అంతే ఇంటెన్స్ కెమిస్ట్రీని పండించారు. షోలోనే ఎంగేజ్‌మెంట్, పెళ్లి వరకు వెళ్లారు.
దీంతో ఆడియెన్స్ ఈ జంటకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ ఇద్దరిని విడిగా చూసే పరిస్థితి కనిపించడం లేదు. ఇద్దరు కలిసే ఉండాలని, పెళ్లి చేసుకోవాలనే డిమాండ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తరచూ రష్మితో బంధంపై సుడిగాలి సుధీర్‌కి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. దీనికి సుడిగాలి సుధీర్ ఇచ్చిన స్టేట్ మెంట్ మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా మారింది.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నటించిన `కాలింగ్ సహస్త్ర` చిత్ర ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో రష్మితో పెళ్లి ఎప్పుడు ? అనే ప్రశ్న సుధీర్‌కి వచ్చింది. దీనికి ఆయన స్పందన టూ క్రేజీగా ఉంది. ఈ ప్రశ్న తనకు తరచూ ఎదురవుతూనే ఉందని తెలిపారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు సుధీర్. అయితే రష్మితో కెమిస్ట్రీ, వగైరా అంతా స్క్రీన్ కోసం చేసిందే అని చెప్పారు.
పెళ్లి గురించి చెబుతూ, పెళ్లి అనేది మన చేతుల్లో లేదని తెలిపారు. ప్రస్తుతానికి సినిమాలపైనే తన ఫోకస్ ఉందని, పెళ్లి గురించి ఆలోచించడం లేదన్నారు. పెళ్లి అనేదే తన మైండ్ లో లేదని, నాకసలు మ్యారేజే వద్దు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని, కెరీర్,ఫ్యామిలీ అనే వేలో వెళ్తున్నా, ఒకవేళ దేవుడు అటు కాదు, ఇటూ కూడా అని పెళ్లి వైపు తిప్పితే చెప్పిలేను గానీ, ప్రస్తుతం తాను కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టు చెప్పారు. పొరపాటున ఏమైనా అయితే ఏం చేయలేనని తెలిపారు.
ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సుధీర్‌కి అమ్మాయిల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఊ.. అంటే పెళ్లి చేసుకునేందుకు వేల మంది అమ్మాయిలు క్యూ కడతారు. ఆయనపై అభిమానంతో ఎన్నో ఆశలతో ఉన్నారు. అలాంటిది తాను పెళ్లే చేసుకోను, పెళ్లే ఇష్టం లేదు, ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నానని చెప్పడంతో వారంతా హార్ట్ బ్రేక్ అయిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉంటే రష్మితో కలిసి సినిమా చేయడంపై సుధీర్ స్పందిస్తూ, ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నామని, కానీ అలాంటి కథలు దొరకడం లేదన్నారు. ప్రస్తుతం `గాలోడు` చిత్ర మేకర్స్ ఓ కథపై వర్క్ చేస్తున్నారని, ఇంకా సెట్ కాలేదన్నారు. నచ్చే స్క్రిప్ట్, ఇద్దరికి సెట్ అయ్యే స్క్రిప్ట్ వస్తే చేసేందుకు తామిద్దరం సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. త్వరలో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని సుధీర్ వెల్లడించారు. అన్నట్టు ఇప్పుడు సుధీర్ `జబర్దస్త్` షో వదిలేసి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.