డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఉత్సాహభరితంగా స్టెప్పులేసి ప్రేక్షకులని అలరించారు. మధ్యలో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో అభిమానులని ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. 

ఇక రష్మిక కూడా ఎప్పటిలాగే ఈవెంట్ లో క్యూట్ లుక్స్ తో, చలాకి మాటలతో అలరించింది. చివర్లో ఇద్దరి ప్రసంగాలతో ఈవెంట్ కు ముగింపు పలికారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ చిత్రం తమ టీమ్ మొత్తానికి మంచి జర్నీ అని తెలిపాడు. రష్మిక 'లిల్లీ' పాత్ర గురించి మాట్లాడుతూ.. ఏఈ చిత్రంలో బాబీలాగా అందరు అబ్బాయిలు ఉండకపోవచ్చు. కానీ లిల్లీలాగా ప్రతి ఒక్క అమ్మాయి జీవితం ఉంటుంది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. 

రష్మిక మాట్లాడుతూ.. ఇప్పటివరకు సరదాగా గడిపాం. ఈ చిత్రం గురించి సీరియస్ గా కొన్ని విషయాలు చెబుతా. మహిళలకు ఇప్పటికి మన సమాజంలో సరైన గౌరవం దక్కడం లేదు. గౌరవం పొందేందుకు కూడా మీ తల్లో, చేల్లో, మీ పక్కింటి అమ్మాయో పోరాడుతూనే ఉన్నారు. 

నేను నటిని అవుతానంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ పోరాడి వాళ్ళని ఒప్పించి ఈ స్థాయికి చేరుకున్నా. మీరు కోరుకున్నది జరగాలంటే పోరాటం చేయాలి అని రష్మిక తెలిపింది. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని రొమాన్స్ కోసమో, యాక్షన్ కోసమో చూడొద్దు. మేము మీకు చెప్పాలనుకునే సందేశం కోసం చూడండి అని రష్మిక అభిమానులని కోరింది. ఈ నెల 26న డియర్ కామ్రేడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్: లిల్లీపై ఫుల్ క్రష్ అంటున్న బాబీ!

'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్: స్టేజిపై అదరగొట్టిన విజయ్ దేవరకొండ