యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. గీతా గోవిందం తర్వాత మరోసారి విజయ్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ఇది. జులై 26న ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఓ ఈవెంట్ జరుగుతోంది. 

ఇప్పటికే విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి ఈ చిత్రంలోని పాటలకు స్టెప్పులేశాడు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ బాబీకి లిల్లీ అనే అమ్మాయి కనిపిస్తుంది. చూడగానే ఆమెపై ఫుల్ క్రష్ ఏర్పడుతుంది అని సరదాగా తెలిపాడు. ఆ తర్వాత గౌతమ్ భరద్వాజ్ 'నీ నీలికన్నుల్లో' అనే మెలోడీ సాంగ్ కు పెర్ఫామ్ చేస్తుండగా రష్మిక మందన ఎంట్రీ ఇచ్చింది. 

'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్: స్టేజిపై అదరగొట్టిన విజయ్ దేవరకొండ