యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. గీతా గోవిందం తర్వాత మరోసారి విజయ్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ఇది. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మూవీస్ సంస్థ నిర్మాణంలో ఈ క్రేజీ చిత్రం తెరక్కుతోంది. జులై 26న ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఓ ఈవెంట్ జరుగుతోంది. 

ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో విజయ్ దేవరకొండ లైవ్ పెర్ఫామెన్స్ చేస్తాడని చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించింది. విజయ్ దేవరకొండ స్టేజి వెనుక భాగం నుంచి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. డియర్ కామ్రేడ్ టైటిల్ సాంగ్ కు ఎనర్జిటిక్ స్టెప్పులేసి అలరించాడు. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ కూడా హాజరయ్యాడు.