సుధీర్ తో పెళ్లి నా ఇష్టం : రష్మీ

Rashmi fires on netiezen
Highlights

సుధీర్ తో పెళ్లి నా ఇష్టం : రష్మీ

ఇప్పుడున్న వాళ్లలో బుల్లి తెరపై ఓ రేంజ్ తో దూసుకుపోతున్న యాంకర్ రష్మి. ఇటీవల ప్రసారం అయిన ఓ షోలో సుధీర్, రష్మీ సరదాగా పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. అది ట్విట్టర్‌లో ఓ అభిమాని రష్మీకి ఓ సలహా ఇచ్చి కోపం తెప్పించాడు. 'సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు'.. అని ఓ అభిమాని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు.


దీంతో స్పందించిన రష్మీ 'మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు' అని పేర్కొంది. 

 

loader