నితిన్ టైమ్ చాలా బాగుంది.  వరస ఫ్లాప్ ల తర్వాత వచ్చిన `భీష్మ‌` సూప‌ర్ హిట్‌…ఆ వెంట‌నే పెళ్లి.. ఇలా మాంచి జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ మరో చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించేసారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రంగ్‌దే`. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి. ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నితిన్‌, కీర్తి జంట కనువిందు చేయనుంది. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి.

 ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఇది.  ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.  నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి