MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

Sangeetha Vijay: దళపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్ట్ లో పిటిషన్‌ వేసింది. దీంతో ఇది కోలీవుడ్‌ లో చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో సంగీత కి ఉన్న ఆస్తులు వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 28 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్‌తో విడాకులకు సంగీత పిటిషన్‌
Image Credit : facebook

విజయ్‌తో విడాకులకు సంగీత పిటిషన్‌

స్టార్ హీరో, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఏప్రిల్ 30న విచారణకు రానుంది. విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, దాన్ని తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని సంగీత ఆరోపించారు. కొన్నేళ్లుగా విజయ్‌కు దూరంగా ఉంటున్నట్లు కూడా ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో సంగీత ఆస్తి విలువ వివరాలు బయటకు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంగీత విజయ్‌ నేపథ్యం
Image Credit : facebook

సంగీత విజయ్‌ నేపథ్యం

సంగీత శ్రీలంకకు చెందిన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి స్వర్ణలింగం యూకేలో పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన అక్కడ ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. విజయ్‌కు వీరాభిమాని అయిన సంగీత, ఒకసారి ఆయన్ను కలవడానికి చెన్నైలోని షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. తన కోసం విదేశాల నుంచి వచ్చిన అభిమానితో విజయ్ మాట్లాడారు. ఆ మొదటి సమావేశంలోనే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

Related Articles

Related image1
Vijay Divorce: ఆ హీరోయిన్‌తో విజయ్‌కి ఎఫైర్, కోర్టుకెక్కిన భార్య సంగీత.. పిటిషన్‌లో సంచలన విషయాలు!
Related image2
Trisha Krishnan: మా అన్న కుటుంబాన్ని నాశనం చేశావ్.. విజయ్-సంగీత విడాకుల నేపథ్యంలో త్రిషపై ట్రోలింగ్!
35
విజయ్‌, సంగీత ప్రేమ నుంచి పెళ్లి వరకు
Image Credit : instagram

విజయ్‌, సంగీత ప్రేమ నుంచి పెళ్లి వరకు

వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని 1999లో పెళ్లి జరిపించారు. వీరి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖులతో పాటు విజయ్ అభిమానులు కూడా హాజరయ్యారు. విజయ్-సంగీత దంపతులకు జాసన్ సంజయ్ అనే కొడుకు, దివ్య సాషా అనే కూతురు ఉన్నారు. జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పనిచేస్తుండగా, దివ్య లండన్‌లో చదువుకుంటోంది.
45
సంగీత ఆస్తి విలువ
Image Credit : instagram

సంగీత ఆస్తి విలువ

నటుడు విజయ్ సినిమాల ద్వారా కోట్లు సంపాదించి, రూ.600 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. పెళ్లి సమయంలో విజయ్ కంటే సంగీతనే ఎక్కువ ఆస్తిపరురాలు. కానీ, ఇటీవలి కాలంలో విజయ్ మార్కెట్ భారీగా పెరిగింది. ఆయన ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. ఈ కారణంగానే విజయ్‌తో పోలిస్తే సంగీత ఆస్తి విలువ కాస్త తక్కువగా ఉంది. ఆమె ఆస్తి విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
55
విజయ్‌కి భార్య రూపంలో ఎదురుదెబ్బ
Image Credit : instagram

విజయ్‌కి భార్య రూపంలో ఎదురుదెబ్బ

సంగీత విడాకుల కోసం పిటిషన్ వేయడమే కాకుండా, విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరో నటితో ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు తనను గృహ నిర్బంధం చేశారని ఆమె ఆరోపించారు. ఈ విడాకుల కేసు విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం విజయ్‌కు కష్టమవుతుందనే చర్చ మొదలైంది. మరి దీన్ని ఎలా ఫేస్‌ చేస్తారో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్.. స్టేజీ మీద అదరగొట్టిన నిజామాబాద్ కుర్రాడు
Recommended image2
Srishti Vyakaranam: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి తండ్రితో తిట్లు, మోడలింగ్ లో సత్తా చాటిన సృష్టి..
Recommended image3
Shalini Damera: అభిజీత్‌తో షూస్‌ తుడిపించుకొని ఏకంగా బిగ్‌ బాస్‌ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్‌
Related Stories
Recommended image1
Vijay Divorce: ఆ హీరోయిన్‌తో విజయ్‌కి ఎఫైర్, కోర్టుకెక్కిన భార్య సంగీత.. పిటిషన్‌లో సంచలన విషయాలు!
Recommended image2
Trisha Krishnan: మా అన్న కుటుంబాన్ని నాశనం చేశావ్.. విజయ్-సంగీత విడాకుల నేపథ్యంలో త్రిషపై ట్రోలింగ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved