Ram Charan – Rana: ట్రిపుల్ ఆర్ ఓకే.. మరి డబుల్ ఆర్ సినిమా ఎప్పుడంటున్న ఫ్యాన్స్..?

ట్రిపుల్ ఆర్ సరే.. డబుల్ ఆర్ మూవీ ఎప్పుడూ అని అడుగుతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్. ఈ మధ్య రామ్ చరణ్ , రానా ఫోటో వైరల్ అయ్యింది. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో.. సినిమా ఎప్పుడు అంటూ.. ప్రశ్నిస్తున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్.

Ram Charan,Rana Multistarrer Movie

ఒకప్పుడు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డివేస్తే. బగ్గుమనేది. ఫ్యాన్స్ వార్ లు గట్టిగా జరిగేవి. ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ ఉన్నాయి. కాని ఇప్పుడు చాలా వరకూ తగ్గిపోయాయి. దానికి కారణం స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టార్స్ చేయడం. మేమంత ఒక్కటే.. మీరు కూడా ఒకటిగా ఉండండి అంటూ స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ కు సంకేతాలు ఇస్తున్నారు. అలాంటి ఆలోచనోంచి పుట్టిందే ట్రిపుల్ ఆర్ మూవీ కూడా. ఈ సినిమాతో అటు నందమూరి,ఇటు మెగా ప్యాన్స్ మధ్య.. స్నేహ వాతావరణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతున్నారు.

 

ఇక ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు పెరిగిపోయాయి. చాలా మంది స్టార్స్ అటు వైపు మెగ్గు చూపిస్తునారు. రానా, వెంకటేష్  లాంటి స్టార్స్ వరుసగా మల్టీ స్టారర్ చేయడానికి సై అంటున్నారు. రానా ఇప్పటికే ప్రభాస్ తో బాహుబలి చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ తో.. భీమ్లా నాయక్ చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోలంత మల్టీ స్టారర్ సినిమాలైపు చూస్తున్నారు. రామ్ చరణ్,ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లే.. కలిసి సినిమా చేస్తున్నారంటే.. ఈ ట్రెండ్ ఎంతలా ప్రభావం చూపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో మరో మల్టీ స్టారర్ ప్రపోజల్ తెర ముందుకు వచ్చింది.

 

రామ్ చరణ్ – రానా చిన్ననాటి స్నేహితులు. బావా.. బావా అనుకునేంత క్లోజ్. కలిసి చెన్నైలో చవువుకున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తే బాగుంటుందంటూ.. ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మధ్య వీరిద్దరు కలిసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో.. వీరికాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుంది అంటూ.. ఫ్యాన్స్ అడుగుతున్నారు. రామ్ చరణ్.. రామారావు రాజమౌళి కాంబోలో ట్రిపుల్ ఆర్ వచ్చింది. ఇక రామ్ చరణ్ , రానా కాంబోలో డబుల్ ఆర్ కావాలి అంటున్నారు. ఎలాగు ప్రభాస్ తో రానా భారీ మల్టీ స్టారర్ చేశాడు.. ఇక రామ్ చరణ్ తో కూడా ఆ రేంజ్ లో మల్టీ స్టారర్ చేస్తే.. అది కూడా.. చరణ్ కు థీటైన ఆపోజిట్ రోల్ చేస్తే  బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్.

Also Read :Ravi Teja Ravanasura : సంక్రాంతికి స్టార్ట్ అవుతున్న రవితేజ రావణాసుర.. అస్సలు తగ్గట్లేగా..?

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారు.. తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా అకేషన్స్ లో కలుసుకుని.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యామిలీ పార్టీలతో హడావిడి చేస్తుంటారు. మరి ఈ పవర్ ఫుల్ స్టార్స్ కలిసి సినిమా చేస్తే.. అది కూడా ఆపోజిట్ రోల్స్ చేస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ ను శేక్ చేస్తుందంటున్నారు అభిమానులు. సో ఫ్యూచర్ లో వీరి కాంబోలో సినిమా వస్తందేమో చూడాలి.

Also Read: Chiranjeevi: మిస్టర్ కూల్ చిరంజీవికి ఏమైంది?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios