Ravi Teja Ravanasura : సంక్రాంతికి స్టార్ట్ అవుతున్న రవితేజ రావణాసుర.. అస్సలు తగ్గట్లేగా..?
మాస్ మహారాజ్ రవితేజ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ లో ఉండగా.. మరో సినిమా ఓపెనింగ్ కు రెడీ అవుతున్నాడు రవితేజ.
సినిమాల రేసులో ముందు వరసలో ఉన్నాడు సీనియర్ స్టార్ హీరో రవితేజ. తగ్గేదే లే అంటున్నాడు. ఒక దాని వెంట మరొక సినిమా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. వయసు పెరుగుతున్నా కొద్ది.. రవితేజ(Ravi Teja )కు ఊపొస్తోంది. ఒక సినిమా పూర్తి కాకముందే మరో రెండు సినిమాలు లైన్ అప్ చేసుకుంటూ.. ఖాళీగా ఉండకుండా బిజీ అయిపోతున్నాడు.ఖిలాడి సినిమా షూటింగ్ అయిపోబోతుంది..దాంతో.. ప్రస్తుతం మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు మాస్ మహారాజ్.
సంక్రాంతి సందర్భంగా రవితేజ సినిమా ఓపెనింగ్ జరగబోతోంది. – సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రావాణాసురా టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈమూవీని జనవరి 14 న శుక్రవారం ఉదయం 9 గంటల 50 నిమిషాలకు పూగా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. అన్నపూర్ణా స్టూడియో వేదికగా ఈ కార్యక్రమం జరగబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ టీమ్.
రవితేజ ఇక సినిమాలు సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అందుకే మేకర్స్ ను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఖిలాడి అయిపోగానే.. ఆల్ రెడీ స్టార్ట్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ కూడా చకచకా.. కంప్లీట్ చేయబోతున్నారు. ఈ సినిమాను శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రావణాసురా ను సైమన్ టైనస్ గా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు రవితేజ్ అటు మర సినిమా ధమాక మూవీ కూడా సెట్స్ ఎక్కబోతుంది ఇవే కాకుండా... మరో రెండు మూడు కథలను పెండింగ్ లో ఉంచాడు మాస్ మహారాజ్. తగ్గేదే లే అంటున్నాడు.
రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్ లో నటిస్తున్న ఖిలాడి(Khiladi) మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారట. చివరిగా సాంగ్ షూట్ చేస్తున్నారు టీమ్. ఇప్పటికే ఈమూవీ నుంచి వచ్చిన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడో పాటను రీసెంట్ గా న్యూ ఇయర్ కానుకగా. డిసెంబర్ 31న రిలీజ్ చేశారు. మాస్ మసాల సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలకే కాదు. ఖిలాడి నుంచి వచ్చి ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read : Nayanthara: పెళ్లి కాలేదు కాని .. ఫుల్లుగా తిరిగేస్తున్నారు. పెళ్ళెప్పుడంటే మాత్రం..?
పిబ్రవరి 11న రిలీజ్ కాబోతోంది ఖిలాడి సినిమా. అందుకోసం పనులు చకచకా జరిగిపోతున్నాయి. కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.రవితేజ (Ravi Teja) సరసన హీరోయిన్లుగా మీకాక్షీ చౌదరి,(Meenakshi Chaudhari )డింపుల్ హయతి (Dimple Hayathi)ఆడి పాడుతున్నారు. కీలక పాత్రల్లో అర్జున్ నటిస్తన్నారు. సచిన్ ఖేడ్కర్, ముఖేష్ రుషి, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, అనసూయ, ముఖ్య పాత్రల్లో నటిస్తన్నారు.
Also Read : Pushpa OTT: 'పుష్ప' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్? ఈ వారమే