రాంచరణ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ది మూవీ కోసం రాంచరణ్ ప్రదర్శిస్తున్న డెడికేషన్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. 

DID YOU
KNOW
?
ఆగిపోయిన 'మెరుపు'
రాంచరణ్ పెద్ది చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. చాలా ఏళ్ళ క్రితమే చరణ్ నటించాల్సిన స్పోర్ట్స్ మూవీ మెరుపు ప్రారంభమై ఆగిపోయింది. 

రాంచరణ్ పెద్ది మూవీ 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో అప్డేట్ మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో ఆ మూవీ భారీ విజయం సాధించాలని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 

ఈసారి ఏమాత్రం డిజప్పాయింట్ చేయకూడదని రాంచరణ్ కూడా ఈ చిత్రం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాంచరణ్ తన మేకోవర్ మార్చుకున్నారు. రాంచరణ్ ప్రస్తుతం బియర్డ్, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాంచరణ్ ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ఇచ్చారు. జిమ్ వర్కౌట్స్ చేస్తూ కండలు తిరిగిన తన బాడీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో క్షణాల్లో ఈ పిక్ వైరల్ గా మారింది. 

రాంచరణ్ వైల్డ్ లుక్ వైరల్ 

రాంచరణ్ వైల్డ్ లుక్ కి ఫ్యాన్స్ నుంచి క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి. లాంగ్ హెయిర్ తో మగధీర తర్వాత రాంచరణ్ బెస్ట్ లుక్ ఇదే అని అంటున్నారు. మధ్యలో గోవిందుడు అందరివాడేలే చిత్రంలో చరణ్ లాంగ్ హెయిర్ ట్రై చేశాడు. కానీ ఆ లుక్ అంతగా వర్కౌట్ కాలేదు. ఈ ఫోటోకి రాంచరణ్.. పెద్ది మూవీ కోసం చెంజోవర్ మొదలైంది అని కామెంట్ పెట్టారు. 

Scroll to load tweet…

ఈ చిత్రంలో రాంచరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. క్రీడల అంశం కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉండబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో రాంచరణ్ కొట్టిన క్రికెట్ షాట్ కి ఇండియా మొత్తం క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం హార్డ్ హిట్టింగ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. 

ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.