MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాంతారావు ను చివరి రోజుల్లో.. ఆదుకున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?

కాంతారావు ను చివరి రోజుల్లో.. ఆదుకున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్... ఏఎన్నార్ తరువాత అంత పేరు తెచ్చుకన్న అలనాటి హీరో కాంతారావు. కానీ ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆస్తులు పోగోట్టుకుని హాసపిటల్ లో పడ్డ కాంతారావును ఆదుకున్న ఇద్దరే ఇద్దరు స్టార్స్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 28 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జానపద చిత్రాల హీరో..
Image Credit : youtube print shot/v9 videos

జానపద చిత్రాల హీరో..

తెలుగు తెరపై జానపద సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హీరో కాంతారావు. ఒక వైపు పౌరాణిక పాత్రలతో N. T. Rama Rao దైవస్వరూపంగా నిలిచిన కాలంలో, మరోవైపు సాంఘిక చిత్రాలతో అక్కినేని నాగేశ్వరావు ప్రేక్షకాదరణ పొందుతున్న సమయంలో, జానపద హీరోగా.. అద్భుతమైన కథలతో సినిమాలు చేసి.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కాంతారావు. కత్తి యుద్ధ సన్నివేశాలతో ప్రసిద్ధి చెందిన ఆయనను అభిమానులు ప్రేమగా “కత్తి కాంతారావు” అని ముంద్దుగా పిలుచుకునేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు
Image Credit : Asianet News

చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు

సినీ జీవితంలో శిఖరాగ్రాన నిలిచిన ఈ నటుడు చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఉన్న డబ్బు, ఆస్తి అంతా పోగోట్టుకున్నకాంతారావు చిన్న చిన్న పాత్రలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన కాంతారావు.. ఆతరువాత ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోని స్టేజ్ కు వెళ్లిపోయారు. ఆయన్ను ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆదుకోలేదు కానీ.. ఇద్దరు స్టార్స్ మాత్రం కాంతారావు హస్పిటల్ లో ఉన్నారని తెలిసి సాయం చేశారట. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్స్?

34
కాంతారావు కుమార్తే మాట్లాడుతూ..
Image Credit : youtube print shot/v9 videos

కాంతారావు కుమార్తే మాట్లాడుతూ..

ఈ విషయాన్ని కాంతారావు కుమార్తే సుశీల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుశీల మాట్లాడుతూ, “సినిమాలు నిర్మించడం వల్ల నాన్నగారు ఆస్తులను కోల్పోయారు. కానీ ఆయన అసలైన ఆస్తి అభిమానులేనని నేను ప్రత్యక్షంగా చూశాను. నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఎంతోమంది అభిమానులు వచ్చి పరామర్శించేవారు. ఎవరూ పదివేలకు తక్కువ ఇవ్వలేదు. డబ్బులతో కూడిన కవర్లు అమ్మకి ఇచ్చి వెళ్లేవారు” అని తెలిపారు.

44
కాంతారావుకు ఆర్ధిక సాయం చేసిన స్టార్స్..?
Image Credit : youtube print shot/V9 videos

కాంతారావుకు ఆర్ధిక సాయం చేసిన స్టార్స్..?

ఆమె మాట్లాడుతూ, “నాన్నగారి ఆసుపత్రి బిల్లు సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు అయింది. ఆ మొత్తం మేమే చెల్లించాం. ఆ డబ్బంతా అభిమానులు ఇచ్చిందే. నాన్నగారు ఆసుపత్రిలో ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయితే ఇంటికి వచ్చి సహాయం చేసింది ఇద్దరే. విజయశాంతి గారు 50 వేలు, రామానాయుడు గారు 20 వేల వరకూ ఇచ్చారు. వారు తప్పించి.. ఇండస్ట్రీ నుంచి మిగతా ఎవరూ ఆదుకోలేదు. నాన్నగారు ఎప్పుడూ ఎవరిని వేషాలు ఇమ్మని కూడా అడగలేదు. అంతే కాదు చివరి రోజుల్లో కూడా ఎంత ఇబ్బంది ఉన్నా.. డబ్బు కోసం ఎవరినీ అడగలేదు” అని చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image2
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image3
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Related Stories
Recommended image1
Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?
Recommended image2
Temple Jewellery: రష్మిక నుంచి కీర్తి సురేష్ వరకు.. టెంపుల్ జువెలరీతో మెరిసిన సౌత్ పెళ్లికూతుళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved