MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishnu vinyasam collections: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. టాక్‌తో సంబంధం లేకుండా క్రేజీ వసూళ్లు

Vishnu vinyasam collections: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. టాక్‌తో సంబంధం లేకుండా క్రేజీ వసూళ్లు

శ్రీవిష్ణు, నయన సారిక జంటగా నటించిన `విష్ణు విన్యాసం` మూవీ ఈ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 28 2026, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విష్ణు విన్యాసం మూవీకి మిశ్రమ స్పందన
Image Credit : Asianet News

విష్ణు విన్యాసం మూవీకి మిశ్రమ స్పందన

శ్రీవిష్ణు.. కింగ్‌ ఆఫ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. వినోదాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్‌ స్టోరీస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న చిత్రాలే ఉంటాయి. చిన్న కాన్సెప్ట్ తో, దాని చుట్టూ మంచి వినోదాన్ని అల్లుకుని సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు `విష్ణు విన్యాసం` మూవీతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి కొంత డివైడ్‌ టాక్‌ వచ్చింది.

24
తన భుజాలపై సినిమాని నడిపించిన శ్రీవిష్ణు
Image Credit : Asianet News

తన భుజాలపై సినిమాని నడిపించిన శ్రీవిష్ణు

యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వం వహించిన `విష్ణు విన్యాసం` మూవీలో శ్రీవిష్ణుకి జోడీగా నయన సారిక హీరోయిన్‌గా నటించింది. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, శ్రీనివాస్‌ రెడ్డి, గోపరాజు రమణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందింది. శ్రీవిష్ణు తన భుజాలపై వేసుకుని సినిమాని నడిపించారు. ట్రెండీ కామెడీ, జెంజీ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే కొంత నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

Related Articles

Related image1
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Related image2
Tamanna: రాజకీయాల్లోకి తమన్నా, మనసులో మాట.. మైసూర్‌ సాండల్‌ వివాదం వేళ మిల్కీ బ్యూటీ కామెంట్స్ వైరల్‌
34
విష్ణు విన్యాసం కలెక్షన్లు
Image Credit : Asianet News

విష్ణు విన్యాసం కలెక్షన్లు

మరి ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది. సినిమా బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందనేది చూస్తే, మొదటి రోజు డీసెంట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో రెండు కోట్లు వసూలు చేస్తే, ఓవర్సీస్‌లో కలిపి మొత్తం రూ.3.25కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు కోటిన్నరకుపైగా షేర్‌ సాధించింది. రెండో రోజు ఇప్పటికే కోటి వరకు రాబట్టినట్టు సమాచారం. ఈ వీకెండ్‌ మాత్రం సినిమా బాగానే ఆడేలా ఉంది. ఆ తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. ఆడియెన్స్ కి కామెడీ కనెక్ట్ అయితే ఆడుతుంది. లేదంటే సోమవారం నుంచి పడిపోతుందని చెప్పొచ్చు.

44
విష్ణు విన్యాసం.. బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ లెక్కలు
Image Credit : Asianet News

విష్ణు విన్యాసం.. బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ లెక్కలు

`విష్ణు విన్యాసం` మూవీకి దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‌ అయ్యింది. థియేట్రికల్‌ బిజినెస్‌ ని రూ.12కోట్లుగా వెలకట్టారు.  నాన్‌ థియేట్రికల్‌గా దీనికి రూ.16కోట్ల వరకు వచ్చిందని సమాచారం. ఈ లెక్కన ఇప్పటికే నిర్మాతలకు రూ.28కోట్లు వచ్చింది. ఎనిమిది కోట్లు లాభాల్లో ఉన్నారు. కానీ థియేట్రికల్‌గా సినిమా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్‌ నుంచి రూ.24కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తే, బయ్యర్లు సేఫ్‌ లేదంటే నష్టాలు తప్పవు. మరి ఆ టార్గెట్‌ని రీచ్‌ అవుతుందా అనేది చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?
Recommended image2
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?
Recommended image3
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Related Stories
Recommended image1
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Tamanna: రాజకీయాల్లోకి తమన్నా, మనసులో మాట.. మైసూర్‌ సాండల్‌ వివాదం వేళ మిల్కీ బ్యూటీ కామెంట్స్ వైరల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved