గేమ్ ఛేంజర్ ఇన్సైడ్ రివ్యూ.. ఫస్టాఫ్ కాదు సెకండాఫ్ పైనే భారమంతా ?

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి సినిమా మహాద్భుతం అంటూ చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో చెబుతున్నారు. శంకర్ కంబ్యాక్ గ్యారెంటీ అని అంటున్నారు.

Ram Charan Game Changer movie inside review goes viral dtr

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన మాసివ్ ప్రమోషన్స్ రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 21న  డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రం గేమ్ ఛేంజర్. ఆంధ్రప్రదేశ్ లో కూడా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. జనవరి 4న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరగబోతోంది. 

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి సినిమా మహాద్భుతం అంటూ చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో చెబుతున్నారు. శంకర్ కంబ్యాక్ గ్యారెంటీ అని అంటున్నారు. దీనికి తోడు యుఎస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కూడా గేమ్ ఛేంజర్ చిత్రం అదిరిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు.రాంచరణ్ నటన అవార్డులు గెలుచుకునేలా ఉందని చెప్పారు. 

వాస్తవంగా గేమ్ ఛేంజర్ ఎలా ఉంది ? రాంచరణ్ ఎలా నటించాడు ? శంకర్ కంబ్యాక్ ఇచ్చారా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే జనవరి 10 వరకు ఎదురు చూడాల్సిందే. అయితే చెన్నై నుంచి గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఇన్ రిపోర్ట్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా ఉందో వివరిస్తూ రిపోర్ట్ వచ్చింది. ఫస్టాఫ్ లో రాంచరణ్ కాలేజ్ డేస్ పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూ నెమ్మదిగా కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ మొత్తం ఎంగేజింగ్ గా ఉండదు కానీ ఓవరాల్ గా అబౌ యావరేజ్ అన్నట్లుగా ఉంటుందట. అది కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ పడడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. 

ఇక సెకండ్ హాఫ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. గేమ్ మొత్తం మారిపోయేది సెకండ్ హాఫ్ లోనే అని అంటున్నారు. అప్పన్న పాత్రతో ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనే దానిపైనే గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రాంచరణ్ నటనకి మంచి పేరు వస్తుందట. పొలిటికల్ సన్నివేశాలని శంకర్ బాగా డీల్ చేసినట్లు చెబుతున్నారు. 

Also Read : నీ ఇంట్లో ఎగురుకో బయట కాదు, సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి.. బన్నీని ఏకిపారేసిన సురేష్ బాబు, తమ్మారెడ్డి

ఇదిలా ఉండగా ఏపీలో జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఏపీలో భారీ సినిమా ఈవెంట్ జరగలేదు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీలో నిర్వహిస్తుండడం.. పైగా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండడంతో ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి లేదా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. 

వెన్యూ ఫిక్స్ అయ్యాక ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. ఏర్పాట్లు తప్పనిసరిగా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు కాబట్టి సెక్యూరిటీ పటిష్టంగా ప్లాన్ చేస్తారు. ఒకే వేదికపై చాలా కాలం తర్వాత రాంచరణ్, పవన్ కనిపించబోతున్నారు. వీరితో కలసి డైరెక్టర్ శంకర్ కూడా స్టేజిపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్.. రాంచరణ్ నాయక్ మూవీ ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.  

Also Read : ఆ సూపర్ హిట్ పాటని చిరుతో నేను చేయాల్సింది, మరో హీరోయిన్ కి మార్చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేశా

ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. అయితే మెగా ఫ్యాన్స్ కంప్లీట్ గా ఎంజాయ్ చేసే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వం సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇక ఏ చిత్రానికి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేసింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios